ఇయర్ బడ్స్ ఉపయోగిస్తున్నారా.. ఈ జాగ్రత్తలు మీకోసమే..!

ప్రస్తుతం ఎలక్ట్రానిక్ వస్తువుల వినియోగం భారీగా పెరిగిన సంగతి తెలిసిందే.స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్న ప్రతి ఒక్కరు ఇయర్ బడ్స్ ఉపయోగించడానికి ఇష్టపడుతున్నారు.

ఇక టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్( Earbuds ) అందుబాటులోకి వచ్చాక యువత ఈ బడ్స్ ఉపయోగించడం గణనీయంగా పెరిగింది.

అయితే అప్పుడప్పుడు ఇయర్ బడ్స్ ఉపయోగిస్తే పర్వాలేదు.ప్రతిరోజు గంటలు గంటలుగా ఇయర్ బడ్స్ ఉపయోగిస్తే.

వినికిడి శక్తిని కోల్పోయే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. """/" / ఇటీవలే మార్కెట్లో సౌకర్యంగా, అందంగా, అందుబాటు ధరలో టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్( TWS Earbuds ) విడుదల అవుతూ ఉండడంతో యువత వీటికి ఆకర్షితులై అతిగా ఉపయోగిస్తున్నారు.

తాజాగా ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్పూర్ కు చెందిన ఓ 18 ఏళ్ల యువకుడు ప్రతిరోజు గంటల తరబడి ఇయర్ బడ్స్ ఉపయోగించడం వల్ల వినికిడి శక్తి కోల్పోయాడు.

నిపుణుల సూచనల ప్రకారం.ఇయర్ బడ్స్ గంటల తరబడి ఉపయోగించడం వలన చెవిలో ఇన్ఫెక్షన్( Ear Infection ) వస్తుంది.

ఆ తర్వాత కొన్ని రోజులకు వినికిడి శక్తి తగ్గుతుంది.చివరకు చెవిటి వారిగా మారిపోవాల్సిందే.

ఇలా జరగడానికి కారణం ఏమిటంటే గంటల తరబడి చెవిలో ఇయర్ బడ్స్ ఉండడం వల్ల ఇయర్ కెనాల్ లో తేమ పెరుగుతుంది.

ఆ తేమలో బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది.తర్వాత చెవి ఇన్ఫెక్షన్ కు గురవుతుంది.

చెవి లోపలికి గాలి, వెలుతురు పోకుండా ఇయర్ బడ్స్ లాంటివి ఎక్కువ సేపు అడ్డుపెట్టకూడదని నిపుణులు సూచిస్తున్నారు.

"""/" / మరి ఇయర్ బడ్స్ ఉపయోగించాలి అంటే గంటల తరబడి కాకుండా అప్పుడప్పుడు విరామం ఇస్తూ ఉండాలి.

ఇయర్ బడ్స్ చెవిలో పెట్టుకున్నప్పుడు గరిష్ట వ్యాల్యూమ్ 50 శాతానికి మించి( Earbuds Volume ) పెట్టుకోకూడదు.

స్నానం చేసేటప్పుడు చెవులను పరిశుభ్రం చేసుకోవాలి.పూర్తిగా చెవి లోపలికి వెళ్లే ఇయర్ బడ్స్ కాకుండా కాస్త బయటకు ఉండే హెడ్ సెట్ లాంటివి ఉపయోగించడం మంచిది.

ఇక ప్రయాణాలలో ఇయర్ బడ్స్ ఉపయోగించడం చాలా ప్రమాదకరం.

India-Israel Maitri Project : ఇజ్రాయెల్‌లో భారతీయ ఇన్‌ఫ్లూయెన్సర్ల పర్యటన