భారతీయ మహిళకి అమెరికాలో అత్యున్నత పదవి .. వెలుగులోకి మోడీ వ్యతిరేక చర్యలు

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన రిపబ్లికన్(Republican) నేత డొనాల్డ్ ట్రంప్(Donald Trump) తన టీమ్‌లో భారత సంతతికి చెందిన వ్యక్తులకు అవకాశాలు కలిపిస్తున్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే వివేక్ రామస్వామి, జే భట్టాచార్య తదితరులను కీలక పదవులకు నామినేట్ చేశారు.

ఇక రెండ్రోజుల క్రితం భారత మూలాలున్న హర్మీత్ కే ధిల్లాన్‌ను న్యాయశాఖలో పౌరహక్కుల విభాగానికి అసిస్టెంట్ అటార్నీ జనరల్‌గా ఎంపిక చేశారు ట్రంప్.

అయితే ఈ నియామకంపై భారతీయ అమెరికన్లలోనూ, భారత్‌లోనూ పెద్ద చర్చకు దారి తీసింది.

దీనికి కారణం లేకపోలేదు.గతంలో నల్లచట్టాలు రద్దు చేయాలంటూ రైతులు నిర్వహించిన నిరవధిక పోరాటానికి హర్మీత్ గట్టి మద్ధతుదారు.

అంతేకాదు.ఉత్తర అమెరికాలో భారతీయ డెత్ స్క్వాడ్‌లు పనిచేస్తున్నట్లు ఆరోపించడం దుమారం రేపింది.

ఇటీవల అమెరికాలో ఓ ఖలిస్తానీ కార్యకర్తను చంపడానికి భారతీయ పౌరుడైన ఓ మాజీ రా అధికారి ప్రయత్నించాడంటూ అతనిపై కేసు నమోదైన విషయాన్ని ఆమె ప్రస్తావించారు.

"""/" / తన కుటుంబ మూలాలను ప్రస్తావిస్తూ.తాను రైతులతో నిలబడతానని హర్మీత్ తేల్చిచెప్పారు.

మరో పోస్ట్‌లో నిరసనకారులతో సమావేశమై రాజీకి రావాలని భారత ప్రధాని నరేంద్ర మోడీని(Indian Prime Minister Narendra Modi) ఆమె కోరారు.

పంజాబ్‌లో జన్మించిన రైతు బిడ్డగా.వారి పొలాలను, జీవన విధానాన్ని, సంస్కృతిని నాశనం చేసే భారత ప్రభుత్వ(Government Of India) కార్పోరేట్ అనుకూల వ్యవసాయ బిల్లును నిరసనకు దిగిన పంజాబీ రైతులపై దాడితో నా గుండె పగిలిపోతోందని ఆమె ఓ ట్వీట్‌లో విజ్ఞప్తి చేశారు.

వారి మాటలు వినండి.వారిని కలవండి.

రాజీ పడండి అంటూ హర్మీత్ కోరారు. """/" / కాగా.

న్యాయశాఖలో పౌరహక్కుల విభాగానికి అసిస్టెంట్ అటార్నీ జనరల్‌గా హర్మీత్ ధిల్లాన్ నియామకానికి సెనేట్ ఆమోదముద్ర లభించాల్సి ఉంది.

ఒకవేళ ఆమోదం దక్కితే వనితా గుప్తా తర్వాత యూఎస్ అసోసియేట్ అటార్నీ జనరల్‌గా పనిచేసిన రెండవ భారతీయ అమెరికన్‌గా ధిల్లాన్ నిలుస్తారు.

బరాక్ ఒబామా, జో బైడెన్ హయాంలలో వనిత రెండు సార్లు ఆ పదవిని నిర్వర్తించారు.

‘డుగ్గు డుగ్గు బుల్లెట్’ అంటూ హల్చల్ చేస్తోన్న వెన్నెల జయతి (వీడియో)