వాల్మీకి విషయంలో అది తప్పుడు నిర్ణయమే

వరుణ్‌ తేజ్‌ నట విశ్వరూపం చూపించిన 'వాల్మీకి' చిత్రంకు పాజిటివ్‌ రెస్పాన్స్‌ వచ్చింది.

చిత్ర దర్శకుడు హరీష్‌ శంకర్‌ సినిమాను తనదైన శైలిలో మాస్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించి మెప్పించాడు.

మొత్తానికి వాల్మీకి చిత్రం ప్రేక్షకులు అనుకున్న రేంజ్‌లో ఉంది.అయితే వాల్మీకి చిత్రంలో హీరోగా నటించిన అథర్వ విషయంలో మాత్రం విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

ఆ పాత్ర సినిమాకు చాలా కీలకం.హీరో పాత్ర అంటే చాలా ఆశించారు.

కాని అథర్వ నిరాశ పర్చాడు. """/"/  ఈ చిత్రంలో అథర్వ నిరాశ పర్చడానికి ప్రధాన కారణం ఆయన తెలుగు వాడు కాకపోవడమే.

తెలుగు యువ హీరో అయితే సినిమా ఫలితం దుమ్ము రేపే విధంగా ఉండేది.

ముఖ్యంగా యువ హీరో నితిన్‌ లేదా నాగశౌర్య వంటి వారయితే ప్రేక్షకులకు తెలిసిన మొహం కనుక మరింత ఆకర్షణగా ఉండేది అనేది సినిమా చూసిన ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

వరుణ్‌ తేజ్‌ మాత్రమే హైలైట్‌ అవ్వాలనే ఉద్దేశ్యంతో దర్శకుడు హరీష్‌ ఈ నిర్ణయం తీసుకుని ఉంటాడు.

కాని మన యంగ్‌ హీరో కనిపించి ఉంటే సినిమా మరింత హైలైట్‌గా ఉండేది.

"""/"/  వరుణ్‌ తేజ్‌ తో పాటు తెలుగు హీరోనే మరొకరు ఉండి ఉంటే ఫలితం చాల పాజిటివ్‌గా ఉండటంతో పాటు కలెక్షన్స్‌ భారీగా ఉండేవి.

ఇక వరుణ్‌ తేజ్‌ పాత్రకు ఆయన ఇమేజ్‌కు ఏమాత్రం ఢోకా లేకుండానే మరో హీరో పాత్ర ఉంది కనుక మన తెలుగు హీరో ఉండి ఉన్నా కూడా ఇబ్బంది లేకపోయేది అనేది సాదారణ ప్రేక్షకుల వాదన.

సినిమా అనప్పుడు చాలా లెక్కలు, ఇబ్బందులు ఉంటాయి.దర్శకుడు హరీష్‌ శంకర్‌ ఏ ఉద్దేశ్యంతో అథర్వను ఈ చిత్రంలో పెట్టాడో మరి.

చర్మాన్ని కేవలం 20 నిమిషాల్లో డీ-టాన్ చేసే పవర్ ఫుల్ రెమెడీ ఇది.. డోంట్ మిస్!