అఫిషియల్ : హరీష్ శంకర్ తో మాస్ రాజా.. ఈసారి పీరియాడికల్ మూవీ అట!

మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) స్పీడ్ ను ఏ హీరో కూడా తట్టుకోలేడు.

ఈయన వరుసగా నాలుగైదు సినిమాలు ప్రకటిస్తూ వాటిని ఒకదాని వెంట ఒకటి పూర్తి చేస్తూ జెట్ స్పీడ్ తో దూసుకు పోతుంటాడు.

ఇక రవితేజ ప్రెజెంట్ ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు.వరుసగా రెండు బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించి కెరీర్ లోనే మంచి ఫామ్ లో ఉన్నాడు.

ఈయన ప్రజెంట్ చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు.ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న రవితేజ తన లైనప్ లో ఉన్న సినిమాల షూటింగులను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నాడు.

ఏప్రిల్ 7న ఈయన నటించిన 'రావణాసుర' సినిమా రిలీజ్ కాబోతుంది.మరోవైపు పాన్ ఇండియన్ మూవీ టైగర్ నాగేశ్వరరావు సినిమాను కూడా పూర్తి చేస్తున్నాడు.

ఇదిలా ఉండగా ఇప్పుడు రవితేజ మరో మూవీకి సిద్ధం అవుతున్నట్టు తెలుస్తుంది. """/" / మాస్ యాక్షన్ కమర్షియల్ సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని ఆడియెన్స్ లో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న యంగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar).

మరి ఈ డైరెక్టర్ తో మాస్ రాజా ఇప్పటికే మిరపకాయ్ వంటి సినిమాను చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.

మరి ఈ కాంబోలో మరో మూవీ రాబోతుంది అని ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యింది.

తాజాగా ఫ్యాన్స్ తో చిట్ చాట్ నిర్వహించిన రవితేజను ఒక అభిమాని హరీష్ శంకర్ తో మరో మూవీ ఎప్పుడు చేస్తారు అని అడుగగా ఈ ప్రశ్నను హరీష్ కు ట్యాగ్ చేసాడు మాస్ రాజా.

"""/" / మరి ఇందుకు సమాధానంగా ఆయన తామిద్దరి కాంబోలో ఒక భారీ పెరియాడికల్ మూవీ రాబోతుంది అని అందుకు వర్క్ కూడా జరుగుతుందని.

త్వరలోనే పూర్తి వివరాలు తెలియజేస్తామని అన్నారు.దీంతో ఈ కాంబో కోరుకునే ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

ఇక ప్రజెంట్ హరీష్ శంకర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తో ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) సినిమాను చేస్తున్నాడు.

ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.ఇది పూర్తయితే కానీ వీరి కాంబోలో సినిమా వచ్చే అవకాశం ఉంది.

ఆయిలీ స్కిన్ కు బై బై చెప్పాల‌నుకుంటున్నారా.. అయితే అందుకే ఇదే ప‌ర్ఫెక్ట్ రెమెడీ!