చోటా కె నాయుడు కామెంట్స్ పై స్పందించిన హరీష్ శంకర్..

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు హరీష్ శంకర్.

( Director Harish Shankar ) ఈయన చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకుంది.

ముఖ్యంగా ఆయన పవన్ కళ్యాణ్ తో చేసిన గబ్బర్ సింగ్ సినిమా అయితే సూపర్ డూపర్ సక్సెస్ సాధించి ఆయన్ని స్టార్ట్ డైరెక్టర్ గా మార్చింది.

ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో( Pawan Kalyan ) ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమాతో కనక సక్సెస్ కొడితే ఆయనను మించిన దర్శకుడు మరొకరు లేరు అని చెప్పడానికి ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

"""/" / ఇక ఇది ఇలా ఉంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ది బెస్ట్ సినిమాటోగ్రాఫర్ గా గుర్తింపు పొందిన చోటా కె నాయుడు( Chota K Naidu ) డైరెక్షన్ లో వచ్చిన "రామయ్య వస్తావయ్య" సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా పని చేశాడు.

అయితే ఈ సినిమా వచ్చి పది సంవత్సరాలు అవుతున్న ఇప్పుడు చోట కె నాయుడు ఒక ఇంటర్వ్యూలో రామయ్య వస్తావయ్య సినిమా( Ramayya Vasthavayya Movie ) గురించి మాట్లాడుతూ ఆ సినిమా సమయంలో హరీష్ శంకర్ నేను చేసుకోవాల్సిన పని నన్ను సక్రమంగా చేసుకొనివ్వలేదంటూ కొన్ని ఘాట్ వ్యాఖ్యలు అయితే చేశాడు.

దాంతో ఆ విషయం హరీష్ శంకర్ దాకా వెళ్లడంతో ఆయన పది సంవత్సరాల క్రితం జరిగిపోయిన దాని గురించి మళ్ళీ మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు.

"""/" / ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేస్తే వదిలేయండి ఇంకా గెలుకుతాను అంటే మాత్రం అది మీ ఇష్టం అంటూ ట్వీట్ చేశాడు.

ఇప్పుడు ఇండస్ట్రీలో ఇది హాట్ టాపిక్ గా మారింది.ఇక ఇలాంటి వివాదాలు ఇండస్ట్రీలో తరచుగా జరుగుతూనే ఉంటాయి.

ఇక ఇది ఇలా ఉంటే హరీష్ శంకర్ చెప్పినట్టుగానే చోటా కె నాయుడు ఈ విషయం పైన లైట్ తీసుకుంటారో లేదంటే మళ్లీ హరీష్ శంకర్ కి కౌంటర్ వేస్తాడో చూడాలి.

ప్లాప్ డైరెక్టర్ కి మరో ఛాన్స్ ఇస్తున్న నాగశౌర్య… కారణం ఏంటంటే..?