చరణ్ కోసం రెడీ అవుతున్న మెగా డైరెక్టర్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు.

ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తాడనే విషయం రాజమౌళి గతంలోనే వెల్లడించాడు.

కాగా ఈ సినిమాతో మరోసారి చరణ్ బ్లాక్‌బస్టర్ కొట్టడం ఖాయమని అంటున్నారు చిత్ర యూనిట్.

అయితే ఆర్ఆర్ఆర్ తరువాత చరణ్ సినిమా ఎవరితో అనే అంశం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిపోయింది.

ఇప్పటికే ఈ లీస్టులో చాలా మంది స్టార్ డైరెక్టర్ల పేర్లు వినిపించాయి.అయితే చరణ్ కోసం తానొక స్క్రిప్టు రాస్తున్నట్లు మెగా డైరెక్టర్ హరీష్ శంకర్ తెలిపాడు.

ఇప్పటికే పలువురు వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, అల్లు అర్జున్ వంటి మెగా హీరోలతో సినిమాలు చేసిన ఈ డైరెక్టర్, చరణ్ ఇమేజ్‌కు పర్ఫెక్ట్‌గా సరిపోయే కథను రాస్తున్నట్లు తెలుస్తోంది.

""img "aligncenter" Src="" / చరణ్‌కు ఒకసారి తన కథ వినిపించాక ఈ కాంబోపై క్లారిటీ వస్తుంది.

అయితే చరణ్‌తో హరీష్ శంకర్ సినిమా ఉంటుందా లేదా అనేది తెలియాలంటే మాత్రం మెగా కాంపౌండ్ నుండి క్లారిటీ రావాల్సిందే.

ఏదేమైనా చరణ్‌తో సినిమా చేసి తమ సత్తా చాటుకోవాలని పలువురు డైరెక్టర్లు క్యూ కడుతుండటంతో మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.