విలన్ చనిపోవడం వల్లే ఎన్టీఆర్ నటించిన మూవీ ఫ్లాపైందట.. డైరెక్టర్ ఏం చెప్పారంటే?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్( Director Harish Shankar ), పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా గబ్బర్ సింగ్.

ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి సూపర్ హిట్ సాధించిన విషయం తెలిసిందే.

ఈ సినిమా తర్వాత హరి శంకర్ జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) తో రామయ్య వస్తావయ్యా సినిమాను( Ramayya Vastavaiya Movie ) చేశారు.

భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది.

ప్రేక్షకులను కనీస స్థాయిలో కూడా మెప్పించలేక బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా కొట్టింది.

అటు తారక్, ఇటు హరీష్ ఇద్దరి కెరీర్లలోనూ పెద్ద డిజాస్టర్ లలో ఒకటిగా నిలిచింది.

"""/" / నిర్మాత దిల్ రాజు సైతం తనకు అత్యధిక నష్టాలు తెచ్చిపెట్టిన చిత్రాల్లో ఇదొకటని చెప్పుకున్నారు.

తాజాగా హరిశ్ శంకర్ కూడా ఈ సినిమా గురించి స్పందించారు.రామయ్యా వస్తావయ్యా సినిమాకు సెకండాఫే సమస్య అని హరీష్ చెప్పాడు.

ఇంటర్ వెల్ ల్లోనే మెయిన్ విలన్ చనిపోతాడని, అక్కడే సినిమా అయిపోయిందని, ముందే ప్రధాన విలన్ చనిపోవడంతో ఇంక చూడ్డానికి ఏముందని ప్రేక్షకులు ఫీలయ్యారని హరీష్ శంకర్ తెలిపారు.

సెకండాఫ్ కథ, స్క్రీన్ ప్లే సరిగా చేసుకోలేదని ఆయన చెప్పుకొచ్చారు.ఈ సినిమా కోసం తాను ఎంతగానో కష్టపడినట్లు ఆయన చెప్పుకొచ్చారు.

"""/" / తాను దర్శకత్వం వహించిన మిరపకాయ్ గబ్బర్ సింగ్ లాంటి సినిమాల తర్వాత తనపై అంచనాలు భారీగా పెరిగా ఆ అంచనాలను మరింత పెంచుకోవాలని ఉద్దేశంతోనే ఈ సినిమాను చేసినట్లు ఆయన చెప్పుకొచ్చారు.

కానీ ఊహించని విధంగా ఈ సినిమా ఆ దారుణమైన ఫలితాలను అందించినదని ఆయన చెప్పుకొచ్చారు.

తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న హరిశ్ శంకర్ ఈ విషయాలను వెల్లడించారు.ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో హరీష్ శంకర్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాలి.

భర్త అఫైర్ పెట్టుకున్నాడని అందరి ముందే పరువు తీసేసిన భార్య.. వీడియో వైరల్..