గాంధీ ఆసుపత్రిలో సీటీ స్కాన్ యూనిట్ ను ప్రారంభించిన హరీష్ రావు

గాంధీ ఆసుపత్రిలో సీటీ స్కాన్ యూనిట్ ను ఇవాళ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ MRI, Cathalab సెంట‌ర్ల‌ను 45 రోజుల్లో ప్రారంభిస్తామ‌ని వెల్ల‌డించారు.

ఒమిక్రాన్ వేరియంట్ ఇంకా తెలంగాణలోకి రాలేదన్నారు.ఇప్ప‌టి వ‌ర‌కు విదేశాల నుంచి వ‌చ్చిన అనుమానితుల‌కు 13 మందికి నెగిటివ్ వ‌చ్చింద‌నిరెండు కేసులు పెండింగ్ లో ఉన్నాయ‌ని స్ప‌ష్టం చేశారు.

ఇక తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా టెస్ట్ ల సంఖ్య పెంచుతామ‌న్నారు.కరోనా సమయంలో ఇక్కడి డాక్టర్స్ అద్భుత సేవలు అందించార‌ని ప్రైవేట్ ఆసుపత్రులు చేతులెత్తేసిన కేసులు కూడా గాంధీ లో సేవలు నిర్వ‌ర్తించార‌ని కొనియాడారు మంత్రి హ‌రీష్ రావు.

క‌రోనా వ్యాక్సిన్ మొదటి డోస్ 95 శాతం జ‌రిగింద‌ని… రెండో డోస్ 51 శాతం పూర్తి అయింద‌న్నారు.

మరో సినిమాకి సీక్వెల్ రెడీ చేస్తున్న సందీప్ రెడ్డి వంగ…