MLA Harish Rao : ఎంపీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలి అంటూ హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు..!!

mla harish rao : ఎంపీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలి అంటూ హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు!!

బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు( BRS MLA Harish Rao ) బుధవారం జనగామ నియోజకవర్గ పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.

mla harish rao : ఎంపీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలి అంటూ హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు!!

ఈ సందర్భంగా త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో పార్టీ గెలుపు కోసం అందరూ కష్టపడి పనిచేయాలని సూచించారు.

mla harish rao : ఎంపీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలి అంటూ హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు!!

ఈ పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ( Congress )కి గట్టిగా గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.

ఇదే సమయంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో కరెంటు కష్టాలు మొదలయ్యాయి అని సెటైర్లు వేశారు.

రాష్ట్రంలో ఎడాపెడా కరెంటు కోతలు విధిస్తూనే ఉన్నారు.ఈ కారణంగా ప్రజలు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

"""/"/ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) చేస్తున్న వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్ర పరువు తీసేలా ఉన్నాయని విమర్శించారు.

రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రజలు కేసీఆర్( KCR ) కే పట్టం కడతారని వ్యాఖ్యానించారు.

ఇదే సమయంలో అసెంబ్లీ ఎన్నికలలో జనగామలో గులాబీ జెండా ఎగరవేసిన సైనికులకు కృతజ్ఞతలు తెలిపారు.

బీఆర్ఎస్ పార్టీకి ఉద్యమాలు అరెస్టులు కొత్త కాదని అన్నారు.అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ ఎప్పుడు ప్రజాపక్షమే అని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఇచ్చిన హామీలన్నిటిని అమలు చేస్తామని అన్నారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నేటికి 60 రోజులు పూర్తయింది.అయితే అధికారంలోకి వచ్చిన వెంటనే రుణమాఫీ చేస్తామని తెలిపారు.

4000 పింఛన్ ఇస్తామని ఊదరగొట్టారు.కానీ ఉన్న రెండువేల పెన్షన్ కూడా కట్ చేశారని విమర్శించారు.

మరి కొద్ది రోజుల్లో జరగబోయే లోక్ సభ ఎన్నికలలో అందరూ కష్టపడాలని బీఆర్ఎస్ గెలుపుకు కృషి చేయాలనీ పార్టీ నేతలకు హరీష్ రావు సూచించారు.

సారంగపాణి జాతకం మూవీ రివ్యూ అండ్ రేటింగ్!