Harish Rao : కవిత అరెస్టును నిరసిస్తూ రేపు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు హరీష్ రావు సంచలన ప్రకటన..!!
TeluguStop.com
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( MLC Kavitha Arrest ) అరెస్టు అక్రమమని హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ.కాంగ్రెస్ పార్టీలు కలిసి కుట్ర పన్నుతున్నాయి.
ఈ అరెస్ట్ లు.వేధింపులు మాకు కొత్త కాదు.
శుక్రవారం కోర్టు సమయం ముగిశాక ప్లాన్ ప్రకారం అరెస్టు చేశారు.కాంగ్రెస్, బీజేపీకి ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదు.
ఇదే సమయంలో అక్రమ అరెస్ట్ పై పిటీషన్ వేస్తాం.న్యాయపరంగా పోరాడతాం అని హరీష్ రావు వ్యాఖ్యానించారు.
కవిత అరెస్ట్ ను వ్యతిరేకిస్తూ రేపు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని హరీశ్ రావు ప్రకటించారు.
"""/" /
'కవిత అరెస్టు బీజేపీ, కాంగ్రె( Congress , BJP )స్ కుట్ర.
అక్రమ అరెస్టుపై పిటిషన్ వేస్తాం.న్యాయపరంగా పోరాడతాం.
మాకు పోరాటాలు కొత్తకాదు.మా పార్టీ పుట్టిందే ఉద్యమంలో' అని హరీశ్ స్పష్టం చేశారు.
పరిస్థితి ఇలా ఉండగా హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలిస్తున్న నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
బీఆర్ఎస్ శ్రేణులు వస్తాయనే అంచనా నేపథ్యంలో ఈడీ విజ్ఞప్తితో కవిత ప్రయాణానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా సెక్యూరిటీని ఏర్పాటు చేశారు.
అటు ఓఆర్ఆర్ మీదుగా కవితను తరలిస్తున్న ఈడీ అధికారులు.కాసేపట్లో ఎయిర్ పోర్టుకు చేరుకొనున్నారు.
సల్మాన్ రష్మిక మధ్య 30 సంవత్సరాల ఏజ్ గ్యాప్.. ఈ కామెంట్లపై అమీషా రియాక్షన్ ఇదే!