ఈటల రాజేందర్‌ చేసిన వ్యాఖ్యల పై క్లారిటీ ఇచ్చిన హరీశ్‌రావు.. !

తెలంగాణలో రాజకీయ వ్యవహారాలు ఎప్పటికప్పుడు ఉప్పెనలా మారుతున్నట్లుగా కనిపిస్తున్నాయట.ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ నుండి వైద్యశాఖ మంత్రిగా ఉన్న ఈటల భూ ఆరోపణల పై ఆ శాఖ నుండి వైదొలగడం, ఆయన మీద చకా చకా ఎంక్వరీలు జరగడం, పార్టీకీ రాజీనామ చేయడం అన్ని ఒక మాసంలోనే జరిగిపోయాయి.

అయితే గులాభి కండువా వీడినప్పటి నుండి టీఆర్ఎస్ పార్టీ పై ఈటల పలుమార్లు ఎన్నో విమర్శలు చేశారు.

ఈ క్రమంలో టీఆర్ఎస్ నేతలు కూడా మాటల దాడికి దిగి అవకాశం చిక్కినప్పుడల్లా ఈటల మీద మిమర్శలు చేస్తూనే ఉన్నారు.

అయితే ఇప్పటి వరకు మంత్రి హరీశ్‌ రావు పెదవి విప్పలేదు.కాగా తాజాగా మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ పార్టీలో తనకు కూడా అనేక అవమానాలు జరిగాయంటూ చేసిన వ్యాఖ్యలను హరీశ్‌ రావు తీవ్రంగా ఖండించారు.

కేసీఆర్‌ పార్టీ అధ్యక్షుడు మాత్రమే కాదని తనకు గురువు, మార్గదర్శి, తండ్రితో సమానులని పేర్కొంటూ ప్రాణం ఉన్నంత వరకు టీఆర్ఎస్ పార్టీలో ఉంటానని క్లారీటి ఇచ్చారు.

బిగ్ బాస్ ఛాన్స్ కొట్టేసిన అలేఖ్య చిట్టి పికిల్స్ సిస్టర్స్…. హింట్ ఇచ్చిన హాట్ స్టార్!