కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు, మాజీ మంత్రి హరిరామజోగయ్య( Former Minister Harirama Jogaiah ) మరోసారి జనసేన అధినేత పవన్ కల్యాణ్ లేఖాస్త్రాన్ని సంధించారు.
పొత్తుల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబును గద్దెను ఎక్కించడానికి కాపులు సిద్ధంగా లేరని స్పష్టం చేశారు.
చంద్రబాబును గెలిపించడం కోసం పవన్ కల్యాణ్( Janasena Pawan Kalyan ) వెంట కాపులు నడవడం లేదని తేల్చి చెప్పారు.
పొత్తులు పెట్టుకున్నా సీట్లు కూడా సాధించలేని జనసేనాని రేపు రాష్ట్ర ప్రయోజనాలను ఏ విధంగా కాపాడతావంటూ ఆయన లేఖలో ఘాటుగా విమర్శలు చేశారు.
"""/"/
టీడీపీ - జనసేన( TDP-Janasena ) సీట్ల సర్దుబాటు వ్యవహారంపై అంటూ ఇరు పార్టీల అధినేతలు ఇప్పటికే పలుమార్లు కీలక సమావేశాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.
అయితే ఈ సమావేశాల్లో ఏ అంశాలను చర్చించారు.? సీట్ల సర్దుబాటు ప్రకారం ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనే అంశాలపై చర్చ జరిగిందని, ఈ క్రమంలో చంద్రబాబు( Chandrababu Naidu ), పవన్ కల్యాణ్ కు క్లారిటీ వచ్చిందనే టాక్ వినిపిస్తోంది.
మరోవైపు జనసేనకు 30 సీట్లని, కాదు 27 సీట్లు అంటూ పలు కథనాలు కూడా వచ్చాయని తెలుస్తోంది.
దీంతో ఈ విషయాన్ని హరిరామ జోగయ్య లేఖ( Harirama Jogaiah Letter )లో పేర్కొన్నారు.
ఈ రకమైన వార్తలను పార్టీ శ్రేణులు గ్రహించాలని ఆయన తెలిపారు.వైసీపీని గద్దె దించడం అంటే టీడీపీకి( TDP ) అధికారం కట్టబెట్టడం కాదని హరిరామజోగయ్య లేఖలో ప్రస్తావించారు.
పవన్ కల్యాణ్ తో కలిసి కాపు సామాజిక వర్గం ప్రయాణం చేస్తున్నది ఈ ఆలోచనలో కాదనే విషయాన్ని గుర్తించుకోవాలన్నారు.
జనసేన మద్ధతు లేకుండా టీడీపీ అధికారంలోకి రావడం కష్టతరమన్న ఆయన ఇందుకు గత ఎన్నికల ఫలితాలే ఉదాహరణ అని పేర్కొన్నారు.
"""/"/
రాష్ట్రంలో ఉన్న మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనసేన కనీసం నలభై నుంచి ఆరవై స్థానాల్లోనైనా పోటీ చేయగలిగితేనే అధికారం సాధ్యమయ్యే అవకాశం ఉంటుందని పవన్ కల్యాణ్ కు హరిరామ జోగయ్య సూచించారు.
అలాగే సుమారు యాభై స్థానాల్లో విజయాన్ని అందుకోవాలన్నారు.అంతేకానీ ఈ అవకాశాన్ని, అధికారాన్ని టీడీపీ ధారాదత్తం చేస్తే జనసేన కలలు ఏ విధంగా సాకారం అవుతాయి.
? జనసేనాని కలలు కంటున్న రాష్ట్ర ప్రయోజనాలు ఎలా సాధ్యం అవుతాయని ప్రశ్నలు సంధించారు.