పవన్ కళ్యాణ్ పోటీ విషయంలో హరిరామ జోగయ్య కీలక సూచనలు..!!

2024 ఎన్నికలకి సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) సీరియస్ నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.

ఆల్రెడీ తెలుగుదేశం పార్టీతో( TDP ) పొత్తు ప్రకటించడం జరిగింది.దాదాపు పది సంవత్సరాలు పాటు రాష్ట్ర అభివృద్ధి కోసం.

టీడీపీతో కలసి పనిచేయబోతున్నట్లు స్పష్టం చేయడం జరిగింది.ఈ క్రమంలో జనసేన పార్టీకి ( Janasena ) చెందిన క్యాడర్ మొత్తం కష్టపడి పని చేయాలని కూడా ఎప్పటికప్పుడు సమావేశాలలో తెలియజేస్తున్నారు.

పరిస్థితి ఇలా ఉంటే తాజాగా కాపు నేత హరిరామజోగయ్య( Harirama Jogaiah ) సంచలన ప్రకటన చేశారు.

రాష్ట్రంలో జనసేన పార్టీకి ఎన్ని  సీట్లకు పోటీ చేయబోతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై స్పందించారు.

రాబోయే ఎన్నికలలో 57 సీట్లలో జనసేన పోటీ చేసేందుకు పరిశీలన జరుగుతున్నట్లు స్పష్టం చేశారు.

వీటిలో 6 సీట్లలో పవన్ కోసం పరిశీలన జరుగుతుందని వెల్లడించారు. """/" / ఆ ఆరు స్థానాలు వివరాలను కూడా వెల్లడించారు.

పిఠాపురం, నరసాపురం, భీమవరం, నిడదవోలు, తాడేపల్లిగూడెం, గాజువాక స్థానాలు తెలియజేశారు.రాబోయే ఎన్నికలలో ఈ స్థానాల నుంచి పవన్ పోటీ చేయొచ్చని.

హరిరామజోగయ్య లేఖ విడుదల చేయడం జరిగింది. """/" / ఏది ఏమైనా 2014 ఎన్నికలలో గెలిచిన విధంగా 2024 ఎన్నికలలో( AP 2024 Elections ) గెలవాలని తెలుగుదేశం జనసేన శ్రేణులు భావిస్తున్నాయి.

కాగా డిసెంబర్ 20 నారా లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సభకి పవన్ కళ్యాణ్ కూడా హాజరవుతున్నారు.

ఈ సభ నుండి ఎన్నికల శంఖారావం పూరించనున్నట్లు సమాచారం.

చిరంజీవి అంటే అంత ఇష్టమంటున్న బన్నీ.. మెగా ఫ్యాన్స్ సపోర్ట్ లభిస్తుందా?