హరిహర వీరమల్లు మూవీ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఆ తేదీన అయినా రిలీజవుతుందా?
TeluguStop.com
టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) హీరోగా నటిస్తున్న సినిమాలలో హరిహర వీరమల్లు( Hari Hara Veera Mallu ) సినిమా కూడా ఒకటి.
ఇందులో పవన్ కళ్యాణ్ సరసనా నిధి అగర్వాల్( Nidhi Agarwal ) హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే.
ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాలి.కానీ అనేక కారణాల వల్ల వాయిదా పడుతూనే వస్తోంది.
ఎలక్షన్స్ సమయం కంటే ముందుగా ప్రారంభించిన ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూనే వస్తోంది.
ఎలక్షన్స్ కంటే ముందే ఈ సినిమా విడుదల అవుతుందని అందరూ భావించారు.కానీ ఊహించని విధంగా అభిమానులను నిరాశ పరుస్తూ ఈ సినిమా వాయిదా పడుతూనే వచ్చింది.
"""/" /
ఇకపోతే ఇటీవల హరిహర వీరమల్లు విడుదల తేదీని( Hari Hara Veera Mallu Release Date ) మూవీ మేకర్స్ ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే.
ఈ సినిమా మార్చి 28వ తేదీన విడుదల కాబోతోంది అంటూ నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు.
అయితే షూటింగ్ ఇంకా పెండింగ్ ఉంది ఆ లోపు విడుదల అవుతుందా అని అనుమానాలు కూడా వ్యక్తం చేశారు అభిమానులు.
అయితే ముందు నుంచి అనుకున్నట్టుగానే మరోసారి ఈ సినిమా విడుదల తేదీ వాయిదా పడింది.
ఈ సినిమా షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉండడంతో సినిమాను పోస్ట్ ఫోన్ చేయక తప్పలేదు.
కాగా పవన్ కళ్యాణ్చారిత్రాత్మక యోధుడు వీరమల్లు పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. """/" /
కాగా పవన్ కళ్యాణ్ రాజకీయ షెడ్యూల్స్ వలన వీరమల్లు షూటింగ్ సక్రంగా జరగడం లేదు.
దానితో పదే పదే వీరమల్లు డేట్స్ మార్చుకుంటూ వెళుతున్నారు మూవీ మేకర్స్.తాజాగా హరి హర వీరమల్లు మార్చి 28 నుంచి పోస్ట్ పోన్ చేస్తున్నట్లుగా ప్రకటించడమే కాదు హోలీ స్పెషల్ గా పోస్టర్ వదులుతూ కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేసారు మేకర్స్.
హరి హర వీరమల్లు చిత్రం మే 9న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల చెయ్యనున్నట్లు మూవీ మేకర్స్ సరికొత్త హోలీ పోస్టర్ తో అనౌన్స్ చేసారు.
దానితో పవన్ ఫ్యాన్స్ కాస్త డిజప్పాయయింట్ అవుతున్నారు.పదే పదే రిలీజ్ తేదీ మారడంతో ఫైనల్ గా మే 9 కైనా ఖచ్చితంగా వస్తుందా అనేది వారి టెన్షన్ పడుతున్నారు.
ఈ సరైన ఫిక్స్ అవుతుందా లేదంటే మళ్లీ విడుదల తేదీని వాయిదా వేస్తారా అంటూ కాస్త అసహనం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.
చందాలు వసూళ్లు చేసి కూతురు పెళ్లి చేశాను… కన్నీళ్లు పెట్టుకున్న జబర్దస్త్ కమెడియన్!