షాక్.. 'వీరమల్లు' పూర్తి అయ్యింది 40 శాతమే.. అవ్వాల్సింది 60 శాతమట!
TeluguStop.com
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సెకండ్ ఇన్నింగ్స్ లో వకీల్ సాబ్ తో స్టార్ట్ చేసి ఆ తర్వాత కూడా వరుస సినిమాలను లైన్లో పెట్టడంతో ఫ్యాన్స్ అంతా ఖుషీ గా ఉన్నారు.
సెకండ్ ఇన్నింగ్స్ లో అయినా ఫాస్ట్ గా చేస్తాడు అని భావించారు.అయితే వారికీ నిరాశ తప్పలేదు.
పవన్ ఎప్పటి లాగానే ఏడాదికి ఒక సినిమా కూడా రిలీజ్ చేయలేక పోతున్నాడు.
ప్రెజెంట్ పవన్ చేతిలో మూడు ప్రాజెక్టులు ఉన్నాయి.మరి పవన్ చేస్తున్న సినిమాల్లో ''హరిహర వీరమల్లు'' ఒకటి.
ఈ సినిమా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతుంది.ఈ సినిమా గత రెండేళ్ల నుండి షూటింగ్ జరుపు కుంటుంది.
కానీ ఏదో ఒక అడ్డంకి అయితే ఎదురవుతూనే ఉంది.దీంతో ఎప్పుడు ఈ షూటింగ్ వాయిదా పడుతూనే వస్తుంది.
పవన్ రాజకీయాల కోసం అని షూటింగ్ కు బ్రేక్ వేయడంతో ఇంకా ముగింపు దశకు చేరుకోలేక పోతుంది.
అయితే ఇప్పటి వరకు ఈ సినిమా 50 శాతం కానీ 60 శాతం కానీ పూర్తి అయ్యింది అని అనుకున్నారు.
కానీ అలా అనుకున్న వారికీ ఇప్పుడు ఒక షాకింగ్ వార్త తెలుస్తుంది.ఈ సినిమా ఇంకా 40 శాతం మాత్రమే పూర్తి అయ్యిందట.
ఇంకా 60 శాతం షూటింగ్ బ్యాలెన్స్ ఉందని తెలుస్తుంది.మరి ఈ 60 శాతం షూటింగ్ పూర్తి అవ్వడానికి ఎలా లేదన్న 6 నెలల సమయం పడుతుంది.
"""/"/
అది కూడా పవన్ కళ్యాణ్ ఎలాంటి బ్రేక్స్ తీసుకోకుండా ఉంటేనే.లేకపోతే ఈ సినిమా ఎప్పుడు పూర్తి అవుతుందో కూడా తెలియదు.
మరి డైరెక్టర్ క్రిష్ టార్గెట్ మాత్రం ఏప్రిల్ లోపు కంప్లీట్ చేయాలనీ పెట్టుకున్నారట.
కానీ ఇది జరగాలంటే పవన్ మీదనే ఆధారపడి ఉంది.పవన్ డిలే కారణంగా క్రిష్ ఒకానొక సమయంలో అసంతృప్తి వ్యక్తం చేసినట్టు కూడా తెలుస్తుంది.
మరి ఈ సినిమా ఎప్పుడు పూర్తి అవుతుందో చూడాలి.