ఈ లెక్కన 'వీరమల్లు' సమ్మర్ లో కూడా కష్టమే!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లైనప్ లో ముందు వరుసలో ఉన్న చిత్రం ''హరిహర వీరమల్లు''.

ఇప్పుడిప్పుడే పవన్ రాజకీయాలను పక్కన పెట్టి షూటింగులతో బిజీ అవుతున్నాడు.మరి ఈ క్రమంలోనే పవన్ ముందుగా హరిహర వీరమల్లు సినిమానే పూర్తి చేయాల్సి ఉంది.

భీమ్లా నాయక్ తర్వాత మరో సినిమాను రిలీజ్ చేయలేదు.దీంతో పవన్ సినిమా కోసం ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు.

ప్రెజెంట్ పవన్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హరిహర వీరమల్లు ఈ సినిమా గత రెండేళ్ల నుండి షూటింగ్ జరుపు కుంటుంది.

కానీ ఏదో ఒక అడ్డంకి అయితే ఎదురవుతూనే ఉంది.దీంతో ఎప్పుడు ఈ షూటింగ్ వాయిదా పడుతూనే వస్తుంది.

మొదటిసారి పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు.పీరియాడికల్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు భారీ బడ్జెట్ ను పెడుతున్నారు.

ఈ మధ్యనే చాలా రోజుల తర్వాత ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళింది.

తాజాగా నిర్మాత ఏ ఎం రత్నం చెప్పిన దాని బట్టి ఈ సినిమా సమ్మర్ రిలీజ్ కూడా కష్టమే అనే టాక్ వస్తుంది.

ఈ సినిమా షూటింగ్ మాత్రమే కాదు విఎఫ్ఎక్స్ వర్క్ కూడా చాలా చేయాల్సి ఉందట.

"""/"/ అందుకే ఈ సినిమా సమ్మర్ లో రిలీజ్ చేయడం కష్టమే అంటున్నారు.

సమయం లేదని గ్రాఫిక్స్ నాసిరకంగా చేసి సినిమా రిలీజ్ చేస్తే ఆడియెన్స్ రిసీవ్ చేసుకోలేరు.

వెంటనే ట్రోల్స్ చేయడం స్టార్ట్ చేస్తారు.అందుకే ఈసారి కొద్దిగా లేట్ అయినా విఎఫ్ఎక్స్ వర్క్ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుని అందరికి నచ్చే విధంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని అనుకుంటున్నారట.

దీంతో ఈ సినిమా సమ్మర్ రిలీజ్ కష్టమే అంటున్నారు.ఇక ఏ ఎం రత్నం భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.

ఎక్కిళ్ళు ఎందుకు వ‌స్తాయి.. వాటిని ఆప‌డం ఎలా..?