వీరమల్లు, ఉస్తాద్ ను ప్రేక్షకులు మర్చిపోవాల్సిందేనా.. ఇప్పట్లో అసాధ్యమే!
TeluguStop.com
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) చేస్తున్న సినిమాల్లో హరీష్ శంకర్ తో ''ఉస్తాద్ భగత్ సింగ్'' మూవీ కూడా ఉంది.
ఈ ప్రాజెక్ట్ పై అప్పుడే ఎన్నో అంచనాలు నెలకొన్నాయి.దీంతో పాటు క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు ( Hari Hara Veera Mallu ) కూడా ఉంది.
ఈ రెండు ప్రోజెక్టుల పరిస్థితి ఇప్పుడు అర్ధం కాకుండా ఉంది.ఎందుకంటే ఈ రెండు ప్రాజెక్టులు ఎప్పుడు పూర్తి అవుతాయో తెలియని పరిస్థితి.
"""/" /
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో బిజీగా ఉంటున్నారు.వారాహి యాత్ర చేస్తూ మంగళగిరి చుట్టుపక్కల ప్రాంతాలను చుట్టేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఈయన లైనప్ లో ఉన్న సినిమాలు వాయిదా పడ్డాయి.దీంతో ఇప్పుడు చెప్పుకున్న రెండు సినిమా ఈ ఏడాదిలో వచ్చే అవకాశమే లేదు అంటున్నారు.
ఇక 2024లో అయినా వస్తాయా? అనే సందేహం నెలకొంది.త్రివిక్రమ్ సెట్ చేసిన ఓజి సినిమా( OG Movie ) మాత్రం చకచకా షూట్ జరుగుతుంది.
అంతేకాదు ఈ సినిమా ఈ ఏడాదిలో రిలీజ్ ఖచ్చితంగా ఉంటుంది.అయితే ఉస్తాద్( Ustaad Bhagat Singh ), వీరమల్లు సినిమాలకు మాత్రం ఎప్పుడు డేట్స్ ఇస్తాడు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
వీటికి ఒకటి అరా డేట్స్ సరిపోవు.వీరమల్లుకు ఇంకా 40 రోజుల షూట్ బ్యాలెన్స్ ఉంది.
అలాగే ఉస్తాద్ అయితే మినిమమ్ 100 రోజుల వర్కింగ్ డేస్ కావాలి.ఇన్ని డేట్స్ ఇవ్వడం కష్టమే.
రాజకీయాలతో బిజీగా ఉండే పవన్ 2024 లో ఏపీలో జరగబోయే ఎన్నికలు పూర్తి అయ్యే వరకు ఇన్ని డేట్స్ ఇవ్వడం ససేమిరా కుదరదు.
జులై, ఆగస్టులో డేట్స్ ఉన్న కూడా ఓజి సినిమాకు కేటాయించి ముందు దీనిని పూర్తి చేయాల్సి ఉంది.
"""/" /
ఆ తర్వాత ఎన్నికల ప్రక్రియ( Elections ) రసవత్తరంగా సాగుతుంది.
వీటి నుండి పవన్ బయటకు రావాలంటే చాలా సమయం పడుతుంది.ఆ తర్వాత పరిస్థితి కూడా చెప్పలేం.
పవన్ విజయం సాధిస్తే అధికార వ్యవహారాలలో బిజీ.లేదంటే దీని నుండి బయటకు వచ్చి మళ్ళీ సినిమాలకు తనని తాను సిద్ధం చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది.
దీంతో ఈ రెండు సినిమాలు ఎప్పుడు పూర్తి అవుతాయో అప్పటికి ప్రజలు వీటిని మార్చపోతారేమో చెప్పలేని పరిస్థితి.
మెగా హీరోలకు వరుస ఫ్లాపుల వెనుక కారణాలివేనా.. తెర వెనుక ఇంత జరుగుతోందా?