సల్మాన్ ఖాన్ తో హరీష్ శంకర్..!

టాలీవుడ్ టాలెంటెడ్ డైరక్టర్ హరీష్ శంకర్ బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ని మీట్ అయ్యారు.

ఈ మీటింగ్ కి కారణం ఏమిటో తెలియదు కాని సల్మాన్ ఖాన్ తో హరీష్ శంకర్ దిగిన ఫోటోని తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మీతో చాలా ఆనందంగా గడిపాను.

భాయ్ నాకు లైఫ్ టైం మెమరీని అందించినందుకు థ్యాంక్స్ అంటూ కామెంట్ పెట్టారు.

ప్రస్తుతం సల్మాన్ ఖాన్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమాలో చేస్తున్నారు.

ఇక హరీష్ శంకర్ తో సల్మాన్ ఖాన్ ఫోటో చూసి ఈ కాంబినేషన్ లో సినిమా ఏదైనా వస్తుందా అని గుసగుసలాడుతున్నారు.

హరీష్ శంకర్ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో భవదీయుడు భగత్ సింగ్ సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు.

గబ్బర్ సింగ్ కాంబో రిపీట్ అవుతుండటంతో భవదీయుడు భగత్ సింగ్ మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఈ సినిమా కోసం హరీష్ శంకర్ అదిరిపోయే కథ సిద్ధం చేశారట.పవన్ కళ్యాణ్ ని పవన్ చూపించే డైరక్టర్ లలో ఒకరైన హరీష్ శంకర్ ఈసారి ఎలాంటి సినిమాతో వస్తారని పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎక్సయిటింగ్ గా ఉన్నారు.

హైదరాబాద్ గన్ పార్క్ వద్ద బీజేవైఎం నిరసన.. ఉద్రిక్తత