కోహ్లీ మోటివేషన్ వల్లే వన్డే మ్యాచ్ గెలిచామన్న హార్దిక్ పాండ్యా..!

వెస్టిండీస్ తో జరిగిన మూడవ వన్డే మ్యాచ్లో డెత్ ఓవర్ లో భారత జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా( Hardik Pandya ) అద్భుత ఆటను ప్రదర్శించాడు.

టీం మేనేజ్మెంట్ తో పాటు టీం ఇండియా ఫ్యాన్స్ ను ఎంతగానో సంతోషపరిచాడు.

52 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఐదు సిక్స్ లతో హార్థిక్ పాండ్యా 70 పరుగులు చేయడంతో భారత జట్టు 5 వికెట్ల నష్టానికి 351 పరుగుల భారీ స్కోరు నమోదు చేయగలిగింది.

"""/" / భారత్ 3 వన్డేల సిరీస్ టైటిల్ కైవసం చేసుకున్న తర్వాత ఈ విజయంపై జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందిస్తూ.

భారత్ టైటిల్ కైవసం చేసుకోవడంలో విరాట్ కోహ్లీ( Virat Kohli ) కీలక పాత్ర పోషించాడు అని తెలిపాడు.

తాను రెండు రోజుల క్రితం విరాట్ కోహ్లీ తో మాట్లాడి అతని వద్ద ఎన్నో సలహాలు తీసుకున్నానని హార్థిక్ పాండ్యా తెలిపాడు.

తాను ఏడేమిదేళ్లుగా కోహ్లీతో కలిసి క్రికెట్ ఆడుతున్నానని, అందువల్ల కోహ్లీ చేసిన కొన్ని సూచనలు తనకు ఎంతో సాయం చేశాడని తెలిపాడు.

"""/" / వన్డే ఫార్మాట్లో ఆడుతున్నప్పుడు ముందుగా కొంత సమయం ఆ ఫార్మాట్ లో క్రీజు లో ఉండి అలవాటు పడాలని సూచించినట్లు కూడా తెలిపాడు.

ఎందుకంటే ప్రస్తుతం జట్టులో ఉన్న సభ్యులు ఎక్కువగా టీ20 ఫార్మాట్లో ఆడారు.కాబట్టి కోహ్లీ మాట నా మనసులో ఉండిపోయిందని, అవకాశం కోసం ఎదురుచూసి బ్యాటింగ్ చేసినట్లు తెలిపాడు.

కోహ్లీకి హృదయపూర్వకంగా థాంక్స్ తెలిపాడు ప్రస్తుత తమ జట్టులోని యువ ఆటగాళ్లు ఎంతో పట్టుదలతో ఆడి భారత్ ను గెలిపించాలని, రుతురాజ్, అక్షర లాంటి ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడం కోసమే కోహ్లీ, రోహిత్( Rohit Sharma ) లకు విశ్రాంతి ఇచ్చినట్లు తెలిపాడు.

హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లోను ఐదు, ఆరు ఓవర్లు బౌలింగ్ చేయడం భారత జట్టుకు బాగా కలిసి వస్తోంది.

ఈ ఆల్ రౌండర్ కాస్త నిలకడగా రాణిస్తే విజయాలు చేరువ అవుతాయి.వరల్డ్ కప్ కు ముందు హార్దిక్ పాండ్యా తిరిగి ఫామ్ లోకి రావడం భారత జట్టుకు మంచి శుభ సూచకమే అంటూ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

తోపు డ్యాన్సర్ అయినా.. జూ.ఎన్టీఆర్‌కి డ్యాన్స్ అంటే సచ్చే భయమట..?