తనను జట్టుకు ఎంపిక చేయవద్దంటున్న టీమిండియా ప్లేయర్..!

టీమిండియా క్రికెట్ ఆటగాడు హార్దిక్ పాండ్యా ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడు.అది ఏంటంటే.

ఇకమీదట వచ్చే సౌత్ ఆఫ్రికా పర్యటనకు తనను జట్టు నుంచి ఎంపికచేయవద్దని సెలెక్టర్లను కోరినట్లు తెలుస్తుంది.

ఈ విషయాన్నీ స్వయంగా హార్దిక్ పాండ్యనే భారత సెలెక్షన్ కమిటీ, భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)కి ఈ-మెయిల్ చేసినట్లు జాతీయ మీడియా తెలిపింది.

నేను పూర్తిగా ఆటలో ఫిట్‌నెస్ సాధించే వరకు తనను సెలెక్షన్ ప్రక్రియకు కొద్ది రోజులు దూరంగా ఉంచాలని హార్దిక్ కోరినట్లు తెలుస్తుంది.

హార్దిక్ కు 2019 సంవత్సరంలో వెన్నుముక శస్త్ర చికిత్స జరిగిన విషయం తెలిసిందే.

అప్పటి నుంచి ఇప్పటికి పాండ్యా ఆటలో తన మార్క్ చూపించలేక పోతున్నాడు.సర్జరీకి ముందులాగా బౌలింగ్ తో పాటు బ్యాటింగ్‌ కూడా సరిగా చేయలేకపోతున్నాడు.

మొన్నటి టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకున్నా గాని హార్దిక్ మాత్రం తన ఆటను సరిగా ఆడలేదు.

బౌలింగ్, బ్యాటింగ్‌ రెండింటిలోనూ విఫలం అవ్వడంతో భారత్ భారీగా మూల్యం చెల్లించుకుంది.అంతకుముందు జరిగిన ఐపీఎల్ 2021, ఐపీఎల్ 2020 సీజన్లలో కూడా పాండ్యా రాణించలేదు.

అందుకనే హార్దిక్ ఎన్‌సీఏలో ఫిట్‌నెస్‌ పై దృష్టి సారించినట్లు తెలుస్తుంది.ఈ క్రమంలోనే సుదీర్ఘ కెరీర్ కొనసాగించేందుకే కొంత కాలం పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు కొంత విరామం ఇవ్వాలనకుంటున్నట్లు తెలుస్తోంది.

"""/"/ ప్రస్తుతం హార్దిక్ పాండే తీసుకున్న ఈ నిర్ణయం సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది.

ఇదిలా ఉండగా డిసెంబరు 17 నుంచి వచ్చే ఏడాది జనవరి 26 వరకు టీమిండియా సౌత్ ఆఫ్రికాతో మూడు టెస్టులు, మూడు వన్డేలు, 4 టీ20 మ్యాచులు ఆడనుంది.

కానీ ఇప్పుడు సౌతాఫ్రికాలో కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో టీమిండియా పర్యటనపై అందరిలోను ఆందోళన నెలకొంది.

భారత జట్టును పర్యటనకు పంపాలా వద్దా.? అనే అయోమయంలో బీసీసీఐ ఉంది.

కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో పాటు, సౌత్ ఆఫ్రికా క్రికెట్‌ అధికారులతో మాట్లాడిన తరువాత గాని ఎటువంటి నిర్ణయం తీసుకోబోమని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.

భార్యల సీటు కోసం బస్సులొ చెప్పులతో కొట్టుకున్న భర్తలు