నిజ్జర్ హత్య కేసు : భారత్‌లో రెండుసార్లు పర్యటించిన కెనడా ఇంటెలిజెన్స్ చీఫ్.. ఏం జరుగుతోంది..?

భారత్ - కెనడాల( India - Canada ) మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైన ఖలిస్థాన్ వేర్పాటువాది, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ అధినేత హర్దీప్ సింగ్ నిజ్జర్( Hardeep Singh Nijjar ) హత్య కేసుకు సంబంధించి వివరాలను భారతీయ అధికారులకు తెలియజేసేందుకు కెనడా గూఢచార సంస్థ చీఫ్ డేవిడ్ విగ్నోల్ట్ ఫిబ్రవరి , మార్చి నెలలో రెండుసార్లు భారత్‌కు వచ్చినట్లు సమాచారం.

కెనడియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్ (సీఎస్ఐఎస్) డైరెక్టర్ అయిన విగ్నోల్డ్ .నిజ్జర్ హత్య కేసు దర్యాప్తులో బయటపడిన సమాచారాన్ని భారత్‌తో పంచుకున్నట్లుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి.

"""/" / నిజ్జర్ హత్యలో ప్రమేయం ఉందనే ఆరోపణలపై ముగ్గురు భారతీయ పౌరులు కరణ్ ప్రీత్ సింగ్( Karan Preet Singh ) (28), కమల్‌ప్రీత్ సింగ్ ( Kamalpreet Singh )(22), కరణ్ బ్రార్ (22)లను కెనడా పోలీసులు అరెస్ట్ చేయడానికి వారాల ముందు విగ్నోల్ట్ భారత్‌కు వెళ్లారు.

తదనంతరం నాల్గో నిందితుడు అమన్‌దీప్ సింగ్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.గతేడాది జూన్ 18న ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను బ్రిటీష్ కొలంబియాలోని సర్రేలోని గురుద్వారా సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చిచంపిన సంగతి తెలిసిందే.

ఈ హత్యపై రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసులు (ఆర్‌సీఎంపీ ) దర్యాప్తు చేస్తున్నారు.

"""/" / విగ్నోల్ట్ భారత పర్యటనపై కెనడా ప్రభుత్వానికి చెందిన అధికారి స్పందించారు.

సీఎస్ఐఎస్ డైరెక్టర్ ఇండియాకు వెళ్లినట్లు నిర్ధారించారు.అయితే క్లోజ్డ్ డోర్స్ సమావేశాల సారాంశాన్ని పంచుకోలేమని తెలిపారు.

నిజ్జర్ హత్య కేసులో భారతదేశానికి అనేక మార్గాల ద్వారా తాము సమాచారాన్ని అందించామని సదరు అధికారి పేర్కొన్నాడు.

అయితే విగ్నోల్ట్ పర్యటనలపై వస్తున్న కథనాలపై భారత్ స్పందించాల్సి ఉంది.కెనడా నుంచి నిజ్జర్ హత్య కేసుకు సంబంధించి ఎలాంటి నిర్ధిష్ట సమాచారం అందలేదని భారత్ చెబుతోంది.

కెనడా గడ్డపై ఖలిస్తాన్ అనుకూల అంశాలకు చోటు కల్పించడమే ఇక్కడ ప్రధాన సమస్య అని న్యూఢిల్లీ వాదిస్తోంది.

అమోఘం.. కొన్న సరుకులకు క్యారీ బ్యాగ్ ఇవ్వలేదని ఏకంగా?(వీడియో)