నటుడు చలపతిరావు 1200 సినిమాలు చేయడం వెనక అంత కష్టం దాగుందా?
TeluguStop.com
నిన్నటితరం నటుడు చలపతిరావు( Actor Chalapathy Rao ) గురించి అందరికీ తెలిసిందే.
తెలుగు చలనచిత్ర సీమలో తనకంటూ గుర్తింపు సాధించుకున్న చలపతిరావు అంటే జనాలకు ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది.
ఆయన సినీ ప్రస్థానంలో దాదాపు 1200 సినిమాల్లో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా వివిధ పాత్రలు చేస్తూ అశేష తెలుగు సినిమా అభిమానాలులను ఎంతగానో అలరించారు.
ఆర్ హీరోగా వచ్చిన ‘కథానాయకుడు’ చిత్రం( 'Kathanayakudu' Movie ) ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన చలపతిరావు అనతికాలంలోనే నిలదొక్కుకొని విలక్షణ నటుడిగా పేరుగడించారు.
ఈ క్రమంలో దాదాపు 5 దశాబ్దాలపాటు నటుడుగా కొనసాగిన చలపతిరావు తన మిత్రుడు రాధాకృష్ణతో కలిసి ఆర్.
సి.క్రియేషన్స్ ( RC Creations )పేరుతో ఓ నిర్మాణ సంస్థను కూడా స్థాపించడం విశేషం.
ఆ బేనర్ పైన జగన్నాటకం, కడప రెడ్డెమ్మ, పెళ్ళంటే నూరేళ్ళపంట, ప్రెసిడెంట్‌గారి అల్లుడు, కలియుగ కృష్ణుడు వంటి సినిమాలను నిర్మించి నిర్మాతగానూ తనదైన ముద్రని వేశారు చలపతి.
ఇక చలపతిరావు కుమారుడు రవిబాబు నటుడుగా మంచి పేరు తెచ్చుకోవడమే కాకుండా దర్శకుడుగా విజయవంతమైన సినిమాలు తీసిన సంగతి విదితమే.
ఇక నటుడుగా సుదీర్ఘమైన కెరీర్‌ని కొనసాగించిన చలపతిరావు తన సినీ ప్రస్థానం గురించిన ఓ టీవీ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కాగా చలపతి ప్రస్తుతం మనమధ్య లేకపోయినా, సినిమాల ద్వారా ఎప్పటికీ మానమధ్యే ఉంటారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
"""/" /
కృష్ణాజిల్లాలోని బల్లిపర్రు గ్రామానికి చెందిన చలపతి ఎంతో కష్టపడి పి.
పూర్తి చేసి, నాటకాలంటే విపరీతమైన పిచ్చి ఉండడం వలన మెల్లగా నాటకాల్లో నటించారట.
ఆ తరువాత సినిమా మీద ఇంట్రెస్ట్‌తో లక్ష రూపాయలు తీసుకొని మద్రాస్ రైలు ఎక్కేసిన ఆయన 15 వేలతో ఓ డబ్బింగ్ సినిమా కొనగా అది ఫ్లాప్ అయిందట.
ఆ తరువాత కారు ఉంటే వేషాలు వస్తాయని కారు కొన్నారట.పాపం అది కూడా యాక్సిడెంట్ అవ్వడంతో తెచ్చుకున్న లక్ష రూపాయిలు ఆవిరవ్వడంతో ఏం చెయ్యాలో తెలీక రామారావుగారి దగ్గరికి వెళ్లి, వేషాల కోసం మద్రాస్ వచ్చానని చెప్పాడట.
అలా ఆ టైమ్‌లో ఆయన ‘కథానాయకుడు’ సినిమా చేయడంతో అందులో ఎలక్షన్ కమిషనర్ క్యారెక్టర్ చేయడం జరిగిందట.
అలా వరసగా అవకాశాలు వచ్చాయి అని చెప్పుకొచ్చారు. """/" /
ఈ క్రమంలో చలపతి అనేక ఆర్ధిక సమస్యలను ఎదుర్కొన్నారట.
ఒక్కగానొక్క క్షణంలో ఆర్ధిక సమస్యలతో సతమతం అవ్వడంతో అది చూసిన ఎన్టీఆర్ ఆయనకి చాలా సపోర్ట్ చేసారని చెప్పుకొచ్చారట.
అయితే దాదాపుగా విలన్స్ రోల్స్ చేయడం వలన ఆయనికి చూసి చాలామంది భయపడి పారిపోయేవారట.
అయితే నిన్నే పెళ్లాడతా సినిమా తర్వాత అది పూర్తిగా మారిపోయింది అని చెప్పుకొచ్చారు చలపతి.
ఆ సినిమా తర్వాత అన్నీ పాజిటివ్ వేషాలే చేశాను అని చెప్పుకొచ్చారు.
ఐకాన్ స్టార్ బన్నీకి 2025 సంవత్సరం కలిసొస్తోందా.. ఆ విధంగా సక్సెస్ అవుతున్నారుగా!