డాక్టర్లపై వేధింపులు మానుకోవాలి:ఐఎంఎ

సూర్యాపేట జిల్లా:వైద్యులు ప్రాణాలు కాపాడే వారే కానీ,ప్రాణాలు తీసే వారు కాదని,రోగి మృతి చెందితే డాక్టర్ కారణమంటూ వేధింపులకు పాల్పడడం తగదని సూర్యాపేట ఐఎంఎ అధ్యక్షుడు డాక్టర్ విద్యాసాగర్ అన్నారు.

సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఐఎంఏ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి రాజస్థాన్లో ఆత్మహత్య చేసుకున్న డాక్టర్ అర్చనశర్మకు సంఘీభావంగా స్థానిక తెలంగాణ తల్లి విగ్రహం వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ రాజస్థాన్లో రోగి మృతికి డాక్టర్ కారణమంటూ రోగి బంధువులు, పోలీసుల వేధింపుల కారణంగా డాక్టర్ అర్చనశర్మ ఆత్మహత్య చేసుకోవడం దారుణమన్నారు.

అర్చనశర్మ ఆత్మహత్యకు ముందు రాసిన సూసైడ్ నోట్లో నా ఆత్మహత్యతోనైనా రోగి బంధువులు నేను తప్పు చేయలేదని గుర్తించి శాంతించాలని,నా కుటుంబంపై వేధింపులు మానుకోవాలని పేర్కొనడం ఆవేదనకు గురి చేస్తోందన్నారు.

రోగి మృతి చెందితే డాక్టర్ కారణమంటూ ఆందోళనలు చేయడం, దౌర్జన్యాలకు దిగడం పరిపాటిగా మారిందని అన్నారు.

ఒక డాక్టర్ ఆత్మహత్యకు పాల్పడినది అంటే రోగి బంధువుల వేధింపులు ఎంతగా ఉన్నాయో అర్థం అవుతుందన్నారు.

ఏ డాక్టర్ అయినా రోగి ప్రాణాలు కాపాడేందుకు తన శాయశక్తుల కృషి చేస్తారని,ఈ విషయాన్ని రోగులు బంధువులు గమనించాలన్నారు.

డాక్టర్ లపై దాడులు జరగకుండా ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు చేసి అమలు చేయాలన్నారు.

అనంతరం డాక్టర్ అర్చనశర్మ మృతి పట్ల మౌనం పాటించి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో సూర్యాపేట ఐఎంఏ కార్యదర్శి డాక్టర్ రమేష్ చంద్ర, ఫాస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ హర్షవర్ధన్,ట్రెజరర్ డాక్టర్ సుధీర్,డాక్టర్లు రంగారెడ్డి,విజయ్ మోహన్,రమేశ్ నాయక్,దుర్గాబాయి,సంధ్య,మాధవి,అరుణజ్యోతి, శిరీష,క్రాంతి,మధుబాబు,కలాం,శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

బురదలో రెచ్చిపోయిన యువ జంట.. అలా డాన్స్ చేస్తూ..