హ్యాపీ డేస్ లోని అప్పు.. ఇప్పుడు ఎలా ఉందో తెలిస్తే అవాక్కవవుతారు….

తెలుగులో ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన  "హ్యాపీ డేస్" అనే చిత్రం గురించి కొత్తగా సినీ ప్రేక్షకులకు తెలియజేయాల్సిన అవసరం లేదు.

 ఈ చిత్రంలో ఇంజనీరింగ్ కాలేజ్ లైఫ్ అంటే ఎలా ఉంటుందో దర్శకుడు శేఖర్ కమ్ముల చాలా కలర్ ఫుల్ గా చూపించాడు.

 అయితే ఈ చిత్రంలో టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ సందేశ్, మిల్కీ బ్యూటీ తమన్నా, నిఖిల్ సిద్ధార్థ, రాహుల్ హరిదాస్, గాయత్రి రావు, సోనియా అగర్వాల్, కృష్ణుడు,ఆదర్శ్, తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు.

అయితే ఈ చిత్రంలో నటించిన ఈ ప్రధాన తారాగణం లోని అందరూ ఆ మధ్య కాలంలో తెలుగు తెరపై తళుక్కున మెరిసే తెరమరుగయ్యారు.

 అయితే ఇందులో  ఈ చిత్రంలో అప్పు అలియాస్ అపర్ణ  పాత్రలో నటించిన  గాయత్రీరావు తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికీ బాగానే గుర్తుంటుంది.

ఈ చిత్రంలో హీరో నిఖిల్ సిద్దార్థ్ పై ఉన్నటువంటి ప్రేమ కారణంగా ఆమె చేసేటువంటి అల్లరి పనులతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.

అయితే నటి గాయత్రీ రావు హ్యాపీ డేస్ సినిమా లో నటించిన తర్వాత తెలుగులో ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన  గబ్బర్సింగ్ అనే చిత్రంలో హీరోయిన్ శృతి హాసన్ స్నేహితురాలి పాత్రలో కనిపించింది.

 ఆ తర్వాత మళ్లీ ఇప్పటివరకు ఈమె తెలుగులో నటించలేదు.అయితే నటి గాయత్రి రావు తల్లిదండ్రులు కూడా నటీనటులే.

 ప్రస్తుతం గాయత్రి తల్లి బెంగుళూరు పద్మ తెలుగులో ప్రేమ ఎంత మధురం అనే ధారావాహికలలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తోంది.

అయితే ఒకప్పుడు గాయత్రి రావు మేనత్త సేనియర్ నటి  గాయత్రికూడా తెలుగులో హీరోయిన్ గా నటించింది.

  సినీ కుటుంబ బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ ఎందుకో  గాయత్రీ రావు అవకాశాలను దక్కించుకోవడంలో విఫలమవుతోంది.

 దీంతో ఆ మధ్య ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొని తాను తెలుగమ్మాయి కావడం వల్లే సినిమా అవకాశాలు తలుపు తట్టలేదని అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.

గౌతమ్ కృష్ణ అకిరా లకు ఆ స్టార్ డైరెక్టర్ అంటే ఇష్టమా..?