ఈ ప్రతిమల్లో పవన పుత్రుని కొలిస్తే ఏం అవుతుందో తెలుసా?

బలవంతుడు, ధైర్యశాలి అయిన హనుమంతునికి రామాయణంలో విశేషమైన స్థానం ఉంది.రాముడికి అత్యంత ఆప్తుడైన ఆంజనేయుడు చిరంజీవిగా వర్ధిల్లిన సంగతి తెలిసిందే.

ఆంజనేయ స్వామి మంగళవారం లేదా శనివారం విశేష పూజలు అందుకుంటారు.ఆంజనేయులు సకల భయాలు, ఆందోళనలు, పారద్రోలి శక్తిని కలుగజేస్తాడు.

ఒకవేళ మీరు హనుమంతుడిని పూజిస్తున్నట్లయితే కొన్ని నియమాలు తప్పక పాటించాలి.ఆంజనేయుని ఏ ప్రతిమలో ఎప్పుడు పూజించడం వల్ల ఎలాంటి ఫలితం కలుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం.

ఆంజనేయుడికి సంబంధించి ఎన్నో రకాల ప్రతిమలు ఉంటాయి.ఉత్తరాభిముఖంగా అంటే దక్షిణ వైపున హనుమంతుని ఫోటో ఉంటే మీరు ఏ ప్రతిజ్ఞ నెరవేర్చాలని, ఇంట్లో సమస్యలు తొలగిపోవాలంటే ఇలాంటి ప్రతిమను పూజించడం ద్వారా తొలగిపోతాయి.

అయితే మనం పనిచేసే ప్రదేశంలో ఏవైనా ఆందోళనలు, ఉద్యోగం, వ్యాపారం లేదా వృత్తిలో ఎలాంటి సమస్యలు తలెత్తినా తెలుపు రంగులో ఉన్న ఆంజనేయస్వామి ప్రతిమను పూజించాలి.

ఇది వృద్ధికి మార్గాన్ని తెస్తుంది అలాగే వ్యాపారాన్ని లాభాల బాటలో పయనించేలా చేస్తుంది.

అలాగే పని చేయి ప్రదేశంలో ఏవైనా ఇబ్బందులు తీరిపోతాయి.శ్రీరాముడిని సేవిస్తున్నటువంటి విగ్రహం ఇంట్లో ఉంటే దేనికి కొరత ఉండదు.

ఇంట్లో అందరూ సుఖ సంతోషాలతో కలిగిఉంటారు.ఎలాంటి ప్రతిమను అయినా కూడా మంగళవారం రోజున ఆంజనేయునికి సింధూరంతో పూజించవలెను.

అలాగే తమలపాకులమాల, వడ మాలలు వేయడం ద్వారా భయాందోళనలు తొలగి శక్తి ప్రసాదించును.

ఆంజనేయస్వామికి ఎరుపు రంగు మందార పువ్వులు అంటే ఎంతో ఇష్టమైనవి.పూజ చేసేవారు కాషాయం రంగు దుస్తులను ధరించి, ఎర్రటి మందారాలతో పూజ చేయడం వల్ల ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు.

అలాగే ఆంజనేయస్వామికి కేసరి నైవేద్యంగా పెట్టడం ద్వారా స్వామివారి అనుగ్రహం ఎల్లవేళలా కలుగుతుంది.

పూజ అనంతరం హనుమాన్ చాలీసా చదవడం వల్ల అనుకున్న కోరికలు నెరవేరుతాయి.ఇలా 11 వారాల పాటు చేయడం ద్వారా అనుకున్న కోరికలు నెరవేరుతాయి.

Vegetables : కూర‌గాయ‌లు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలా.. అయితే ఈ టిప్స్ త‌ప్ప‌క తెలుసుకోండి!