ప్రదీప్ హీరోయిన్ కు ఓ మంచి ఆఫర్.. ఇక టాలీవుడ్ లో టాప్ ప్లేస్ ఖాయం
TeluguStop.com
యాంకర్ ప్రదీప్ హీరో గా నటించిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా లో హీరోయిన్ గా నటించిన ముద్దుగుమ్మ అమృత అయ్యర్.
ఆ సినిమా యావరేజ్ అన్నట్లుగా నిలిచినా కూడా మంచి పేరు దక్కించుకున్న అమృత అయ్యర్ కి ఆ తర్వాత మంచి ఆఫర్లు లభిస్తాయని.
వరుసగా సినిమా లు చేస్తుందని అంతా భావించారు.కానీ అమృత అయ్యర్ లక్ కలిసి రాలేదు.
ఆ సినిమా తర్వాత ఇప్పటి వరకు మంచి కమర్షియల్ బిగ్ సినిమాల్లో నటించే అవకాశం రాలేదు.
ఎట్టకేలకు ఒక మంచి సినిమా లో ఈ అమ్మడు నటించింది.తేజా సజ్జా హీరో గా ప్రశాంత్ వర్మ దర్శకత్వం లో రూపొందిన హనుమాన్ సినిమా లో ఈ ముద్దుగుమ్మ నటించే అవకాశం దక్కింది.
"""/"/
తేజా మరియు ప్రశాంత్ వర్మ ల కాంబో లో రూపొందిన ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి.
వీరిద్దరి కాంబినేషన్ లో గతం లో వచ్చిన సినిమా సూపర్ హిట్ అవడం తో హనుమాన్ సినిమా పై జనాల్లో భారీగా ఉన్నాయి.
తేజా కి జోడిగా అమృత అయ్యర్ నటించడం తో ప్రేక్షకులు మరియు ఫిల్మ్ విశ్లేషకులు కూడా ఈసారి ముద్దుగుమ్మకు తప్పకుండా కలిసి వస్తుందని అంటున్నారు.
టీజర్ కి మంచి రెస్పాన్స్ రావడం తో హనుమాన్ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి.
ఒకవేళ ఆ సినిమా సక్సెస్ అయితే ఇక అమృత అయ్యర్ కెరీర్ లో వరుసగా సినిమా లతో దూసుకు పోయే అవకాశాలున్నాయి అంటున్నారు.
టాలీవుడ్ లో టాప్ ప్లేస్ లో ఈ అమ్మడు నిలిచే అవకాశాలు లేక పోలేదని ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.
మొత్తానికి టాలీవుడ్ తో పాటు ఇతర భాషల్లో కూడా విడుదల కాబోతున్న హనుమాన్ సినిమా తో ఈ ముద్దుగుమ్మ ఏ స్థాయిలో పేరు దక్కించుకుంటుంది అనేది చూడాలి.
నా కారణంగానే బన్నీకి దెబ్బలు తగిలాయి… రష్మిక సంచలన వ్యాఖ్యలు!