సారీ దయచేసి క్షమించండి.. టాలీవుడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ ట్వీట్ వైరల్?

టాలీవుడ్ ప్రేక్షకులకు డైరెక్టర్ ప్రశాంత వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్న యంగ్ డైరెక్టర్ లలో ప్రశాంత్ వర్మ కూడా ఒకరు.

తెలుగులో ఎన్నో మంచి మంచి సినిమాలకు దర్శకత్వం వహించి డైరెక్టర్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు.

తెలుగులో అ, కల్కి, అద్భుతం, జాంబిరెడ్డి ఇలా మంచి మంచి సినిమాలకు దర్శకత్వం వహించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

ఇకపోతే దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న తాజా చిత్రం హనుమాన్.ఇందులో తేజ సజ్జ, అమృత అయ్యర్ కలిసి నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే.

అలాగే వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు.ఇదిలా ఉంటే తాజాగా హనుమాన్ టీజర్ ను విడుదల చేశారు.

ఈ టీజర్ కు ప్రస్తుతం ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన అందిస్తోంది.ది కాకుండా విమర్శకుల నుంచి ప్రశంసలు సైతం అందుకుంటుంది.

అలాగే యూట్యూబ్లో ట్రెండింగ్ లో దూసుకెళ్తోంది ఈ హనుమాన్ టీజర్.ఇది ఇలా ఉంటే తాజాగా ప్రశాంత్ వర్మ సోషల్ మీడియాలో ఒక విషయంలో క్షమాపణ కోరుతూ ట్వీట్ చేశారు.

ఎందుకు ఏమిటి అన్న విషయాలలోకి వెళితే. """/"/ రామాయణాన్ని పురాణం అన్నందుకు దయచేసి క్షమించండి అంటూ సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు.

ఆ ట్వీట్ లో ప్రశాంత వర్మ.నా ప్రసంగంలో పురాణం అనే పదాన్ని ఉపయోగించినందుకు దయచేసి క్షమించండి.

రామాయణం మన చరిత్ర అంటూ పోస్ట్ చేశారు.ఇకపోతే జాంబిరెడ్డి సినిమా తరువాత నటుడు తేజ సజ్జా అలాగే దర్శకుడు ప్రశాంత వర్మ కాంబినేషన్ లో వస్తున్న రెండవ సినిమా ఇదే.

ఇప్పటికే విడుదలైన పోస్టర్‌, టీజర్ లకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.

ట్రంప్‌ కోసం వైట్‌హౌస్ ఉద్యోగులను ఎలా ఎంపిక చేస్తుందంటే?