లింగంపల్లిలో రెండవ రోజు కొనసాగిన హనుమాన్ విగ్రహ పునప్రతిష్టణ!

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం లింగంపల్లి గ్రామంలో అతి పురాతనమైన హనుమాన్ విగ్రహ పున ప్రతిష్ట కార్యక్రమం రెండవ రోజు ఘనంగా కొనసాగింది.

గ్రామంలో అత్యంత ప్రతిష్టత్మాకంగా చేపట్టిన విగ్రహ ప్రతిష్టపాణ కార్యక్రమంలో వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా స్థాపిత మండల దేవతార్చన, నవగ్రహ వాస్తు సర్వతోభద్ర హోమాలు, విగ్రహ స్నాపనం మంగళహారతి మంత్రపుష్పం తో పాటు వివిధ కార్యక్రమాలు అత్యంత వైభావంగా నిర్వహించారు.

విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా నిన్న సాయంత్రం నాలుగు గంటలకు ఊరేగింపు కార్యక్రమం గ్రామ ప్రజలను ఆకట్టుకుంది.

అనంతరం గ్రామ ప్రజలకు హనుమాన్ భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సామ కవిత తిరుపతిరెడ్డి, హనుమాన్ టెంపుల్ చైర్మన్ కంటే మల్లయ్య, దుమల నర్సయ్య, రామ్ రెడ్డి, నేదూరి శ్రీనివాస్, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామపంచాయతీ పాలకవర్గం సభ్యులు, గ్రామ ప్రజలు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కాపాడాల్సిన నాన్నే వేధింపులకు పాల్పడ్డాడు.. ఖుష్బూ సంచలన వ్యాఖ్యలు వైరల్!