Teja Sajja Raviteja: రవితేజ వల్ల మాలాంటి వాళ్లకు ఇబ్బందులు.. మాస్ మహారాజ్ పై తేజ సజ్జా కామెంట్స్ వింటే షాకవ్వాల్సిందే!

టాలీవుడ్ యంగ్ హీరో తేజా సజ్జా( Teja Sajja ) గురించి మనందరికీ తెలిసిందే.

తేజ తాజాగా నటించిన చిత్రం హనుమాన్.( Hanuman Movie ) ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.

ఇటీవలే H3 Class=subheader-styleసంక్రాంతి పండుగ/h3p కానుకగా జనవరి 12న థియేటర్లలో గ్రాండ్ గా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ను అందుకోవడంతో పాటు వసూళ్ల సునామీని సృష్టించింది.

మహేశ్‌బాబు- గుంటూరు కారం, వెంకటేష్- సైంధవ్, నాగార్జున- నా సామిరంగా చిత్రాలతో పోటీపడి నిలిచింది.

అంతేకాకుండా ఆ సినిమాలో వెనక్కి నెట్టేసి మరీ టాప్ లో నిలిచింది.చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా దాదాపుగా 250 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సాధించింది.

ప్రస్తుతం హీరో తేజ ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. """/" / అలాగే వరుసగా ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.

అందులో భాగంగానే తాజాగా తేజ మాస్ మహారాజా రవితేజతో( Raviteja ) కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తేజ రవితేజ గురించి చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మూవీ ప్రమోషన్లలో భాగంగా హనుమాన్ హీరో తేజ సజ్జా ఆయనకు పలు ఆసక్తికరమైన ప్రశ్నలు సంధించారు.

వీరిద్దరి మధ్య జరిగిన ఒక ఫన్నీ సమస్యను గురించి ప్రస్తావించారు.రవితేజ వల్ల ఇండస్ట్రీలోకి వస్తున్న కొత్త హీరోలు( New Heroes ) చాలా ఇబ్బందులు పడుతున్నారంటూ చెప్పి షాకిచ్చాడు తేజ సజ్జా.

మీరు చేసే ప్రతి సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఎందుకు ఉంటున్నారు? అంటూ రవితేజను తేజ సజ్జా ప్రశ్నించారు.

టైగర్, రావణాసుర సినిమాల్లో అలాగే ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. """/" / అందువల్ల మాలాంటి యంగ్‌ హీరోలకు చాలా ప్రాబ్లమ్ అవుతోంది.

మీరు చేసే సినిమాల్లో ఇద్దరు హీరోయిన్లు( Two Heroines ) ఉంటున్నారు.మీరు ఏడాదికి మూడు చిత్రాలు చేస్తున్నారు.

దాదాపు 12మందిని ఆడిషన్స్ చేస్తారు.దీంతో ఎవరినీ అడిగినా మేం రవితేజతో సినిమా చేస్తున్నాము, ఆ తర్వాతనే చేస్తామని చెబుతున్నారు.

మీరు ఇద్దరు ముగ్గురు హీరోయిన్స్‌ ను తీసుకోవడం వల్ల మాలాంటి యువ హీరోలు( Young Heroes ) ఇబ్బందులు పడుతున్నారు అంటూ ఫన్నీ కామెంట్స్ చేశారు తేజ సజ్జా.

"""/" / ఇక తేజా మాటలకు రవితేజ తెగ నవ్వుకున్నాడు.ఇకపోతే రవితేజ సినిమాల విషయానికొస్తే.

రవితేజ తాజాగా నటించిన చిత్రం ఈగల్.( Eagle Movie ) ఇందులో కావ్య తాపర్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటిస్తున్న విషయం తెలిసిందే.

సంక్రాంతి పండుగకు విడుదల కావాల్సి ఉండగా సంక్రాంతికి సినిమాల పోటీ ఎక్కువ అవ్వడంతో కాస్త వెనక్కి తగ్గారు ఈగల్ టీం.

కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వచ్చే నెల అనగా ఫిబ్రవరి 9వ తేదీ విడుదల కానుంది.

ఇప్పటికే ఈ మూవీ పై భారీగా అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని రవితేజ అభిమానులు భావిస్తున్నారు.

పెళ్ళాం అమ్మేసింది వీడినేరో… శుభలగ్నం సంఘటనలను గుర్తు చేసుకున్న జగపతిబాబు!