సీతారామం మూవీలో హీరో రోల్ అందుకే చనిపోతుంది.. హను రాఘవపూడి షాకింగ్ కామెంట్స్!

డైరెక్టర్ హను రాఘవపూడి( Hanu Raghavapudi ) సినిమాలు తీసే ధోరణి చాలా విభిన్నంగా ఉంటుందని చెప్పాలి.

ఈయన మొదటి చిత్రం అందాల రాక్షసి సినిమా నుంచి మొదలుకొని ఇటీవల వచ్చిన సీతారామం సినిమా వరకు చాలా విభిన్న ధోరణిలో సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తూ ఉంటారు.

సీతారామం( Sita Ramam ) సినిమా తర్వాత డైరెక్టర్ హను రాఘవపూడి ప్రభాస్ తో( Prabhas ) మరొక సినిమాకు కమిట్ అయ్యారు.

ఇటీవల ఈ సినిమా ఘనంగా పూజ కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి.ఈ తరుణంలోనే ఈయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తనకు సీతారామం సినిమా క్లైమాక్స్ లో హీరో చనిపోవడం గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.

"""/" / సీతారామం సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే .

ఇందులో దుల్కర్ సల్మాన్,( Dulquer Salmaan ) మృణాల్ ఠాకూర్( Mrunal Thakur ) సీత, రామ్ పాత్రలలో ఎంతో అద్భుతంగా నటించారు.

ఇందులోని సన్నివేశాలు, పాటలు ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకున్నాయి.కానీ చివరిలో రామ్ చనిపోవడం అనేది ప్రేక్షకులు ఎవరు కూడా జీర్ణించుకోలేదు.

అయితే రామ్ చనిపోకుండా తిరిగి సీతను కలుసుకొని ఉంటే బాగుండేదనే ఆలోచన ప్రతి ఒక్క ప్రేక్షకుడికి కలిగి ఉంటుంది.

అయితే ఈ విషయం గురించి తాజాగా హను రాఘవపూడి అసలు విషయం వెల్లడించారు.

"""/" / సీతారామం సినిమాలో హీరో రామ్ పాత్ర చనిపోవడం గురించి ఈయన మాట్లాడుతూ.

ఈ సినిమా స్టోరీ రాసుకున్నప్పటి నుంచి రామ్ పాత్రకు చనిపోవడం తప్ప వేరే ఆప్షన్ లేదు.

ఆయన ఎలా వస్తాడు.వస్తే ఏం జరుగుతుంది.

సినిమా అయిపోతుంది.ఇక కథ అక్కడితో అయిపోతుంది.

కానీ ఆ పాత్ర మీతో పాటు ఎప్పటికీ ఉండదు.ఈ విషయంలో అసిస్టెంట్ డైరెక్టర్లు కూడా రామ్ ను బ్రతికించాలి అంటూ నాతో ఫైట్ చేశారు.

కానీ రామ్ పాత్ర ఈ సినిమాలో ఓ అద్భుతం.ఆయనలాగా ఉండడం అంటే చాలా కష్టం.

అలాంటి ఒక అద్భుతమైన పాత్ర ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండి పోవాలి అందుకే తనని చంపేసామని తనని తిరిగి తీసుకువస్తే అది కూడా ఒక సాధారణ క్యారెక్టర్ లాగా ఉండిపోతుంది అంటూ సీతారామం సినిమాలో రామ్ పాత్ర చనిపోవడం గురించి హను రాఘవపూడి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

బాలయ్య బాబీ కాంబోలో వస్తున్న సినిమాలో ఇది హైలెట్ కానుందా..?