యంగ్ డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చిన ప్రభాస్…

పాన్ ఇండియా అనే పదానికి అసలైన నిర్వచనం అంటే ప్రభాస్( Prabhas ) అనే చెప్పవచ్చు .

బాహుబలి సినిమాలతో ప్రభాస్ రేంజ్ మారిపోయింది.ఆ సినిమా తర్వాత ప్రభాస్ దాదాపుగా అన్ని భారీ, ప్యాన్ ఇండియా సినిమాలనే చేస్తున్నారు.

ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కే, సందీప్ రెడ్డి వంగా స్పిరిట్‌తో పాటుమారుతీ దర్శకత్వంలో వస్తున్న థ్రిల్లర్ సినిమాలున్నాయి.

ఇక లేటెస్ట్‌గా ప్రభాస్ మరో సినిమాను కూడా ఓకే చేసినట్లు తెలుస్తోంది.మరోసారి ఓ లవ్ స్టోరీ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో టాక్.

ఈ సినిమాకు సీతారామంతో మంచి విజయాన్ని అందుకున్న హను రాఘవపూడి( Hanu Raghavapudi ) దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది.

ఈ సినిమా విషయంలో మరో వార్త వైరల్ అవుతోంది. """/" / ఈ చిత్రం రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యం లో తెరకెక్కించబోతున్నారని తెలుస్తోంది.

ఈ చిత్రాన్ని యూవీతో పాటు మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఇక ప్రభాస్ హీరోగా నటిస్తున్న మరో భారీ యాక్షన్ సినిమా సలార్.

ఈ సినిమాకు కెజీయఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు.భారీ అంచనాల నడుమ వస్తోన్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది.

అయితే ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కావోచ్చిందని తెలుస్తోంది .

గతంలో సలార్ షూటింగ్ ఇటలీలోని మటేరాలో జరుగింది. """/" / ప్రస్తుతం ఈ సినిమా ఫైనల్ స్టేజ్ లోకి వచ్చేసిందని తెలుస్తోంది.

ప్రస్తుతం మేకర్స్ లాస్ట్ షెడ్యూల్‌ను మొదలు పెట్టారని సమాచారం .ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ 28న గ్రాండ్‌గా విడుదలకానుంది.

ఇక ఈ సినిమా , పాన్ వరల్డ్ సినిమా అని తెలుస్తోంది.అందులో భాగంగా ఈసినిమా ఇంగ్లీష్‌లో కూడా విడుదలకానుందని తెలుస్తోంది.

ఈ విషయంలో త్వరలో అధికారిక ప్రకటన విడుదలకావాల్సి ఉంది.హాలీవుడ్ స్థాయిలో ఈ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నారు .

యాక్షన్ సిక్వెన్స్‌ను హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్‌ను కొరియోగ్రఫి చేస్తున్నారు .ఈ చిత్రానికి సంబంధించి శాటిలైట్ హక్కులు భారీ మొత్తంలో అమ్ముడయినట్టు తెలుస్తోంది.

'సలార్'​ సినిమా కోసం దేశవ్యాప్తంగా ప్రభాస్ అభిమానులు ఎదురుచూస్తున్నారు.ఇక ప్రభాస్ నటిస్తోన్న మరో ప్యాన్ ఇండియా సినిమా రాజా డీలక్స్( Raja Deluxe ) మారుతి దర్శకత్వం వహిస్తున్నారు.

హార్రర్ కామెడీ జానర్‌లో వస్తున్నట్లు సమాచారం.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి 20 శాతం షూట్ పూర్తి అయ్యింది.

ఈ సినిమాలో ఎక్కువ భాగం ఓ ఇంట్లోనే జరుగునుందని సమాచారం.ఇక హను రాఘవపూడి తెరకెక్కే చిత్రం కూడా పాన్ వరల్డ్ స్థాయిలో ఉంటుందని అంటున్నారు .

ఈ 4 చిట్కాలను పాటిస్తే మాత్రం టెన్షన్ ఫ్రీ లైఫ్ సొంతమట.. వెంకీమామ ఏం చెప్పారంటే?