స్టార్ హీరో ప్రభాస్ కు జోడీగా ఇమాన్వీని ఎంపిక చేయడం వెనుక కారణాలివేనా?

ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా హను రాఘవపూడి( Hanu Raghavapudi ) అలాగే డార్లింగ్ ప్రభాస్ కాంబినేషన్లో రాబోతున్న సినిమా గురించి చర్చించుకుంటున్నారు.

ఇటీవల ఈ ఎందుకు ఈ సినిమాను గ్రాండ్ గా పూజా కార్యక్రమాలతో మొదలుపెట్టడంతో అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

అయితే వీటిలో ప్రభాస్( Prabhas ) తో పాటు హీరోయిన్ ఇమాన్వీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన విషయం తెలిసిందే.

ఇక ఆ ఫోటోలు వీడియోలు వైరల్ అవ్వడంతో ప్రతి ఒక్కరూ ఆమె గురించి సోషల్ మీడియాలో వెతకడం మొదలుపెట్టారు.

ఈమె సోషల్ మీడియా స్టార్ అన్న విషయం కూడా మనందరికీ తెలిసిందే. """/" / ఈ సినిమాలో కథానాయికగా ఆమెను ఎంచుకోవడం పై దర్శకుడు హను రాఘవపూడి తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు.

ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.ప్రస్తుతం ఉన్న రోజుల్లో కొత్త టాలెంట్‌ ను వెలికితీయడంలో సోషల్ మీడియా కీలక పాత్ర పోషిస్తున్నాయి.

తమ కథకు అనుగుణంగా నటీ నటులను ఎంపిక చేసుకోవడంలో ఫిల్మ్‌మేకర్స్‌( Filmmakers ) కు సోషల్‌ మీడియా ఎంతో సాయం చేస్తుంది.

ఇమాన్వీ( Imanvi ) అందం, ప్రతిభ కలిగిన అమ్మాయి.అందరిలాగానే నేనూ ఆమె డ్యాన్స్‌ వీడియోలు చూస్తుంటాను.

ఆమె మంచి భరతనాట్యం డ్యాన్సర్‌.కళ్లతోనే ఎన్నో హావ భావాలను పలికిస్తుంటుంది.

అందుకే ఆమెకు ఒక అవకాశం ఇవ్వాలనుకున్నాను అని హను రాఘవపూడి చెప్పుకొచ్చారు. """/" / ఆడిషన్స్‌, స్క్రీన్‌ టెస్ట్‌( Auditions, Screen Test ) అనంతరమే ఆమెను ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు.

ఆమెను సెలెక్ట్‌ చేయడం తన ఒక్కడి నిర్ణయం కాదని చిత్ర బృందం మొత్తం నిర్ణయమని ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇక ఇమాన్వీ ని అలాగే డార్లింగ్ ప్రభాస్ ని పక్కపక్కన చూసి మంచి పేరు బెస్ట్ జోడి అంటూ కామెంట్ల కురిపిస్తున్నారు అభిమానులు నెటిజెన్స్.

ఈ సినిమా ఇంకా పట్టాలెక్కకుం ముందే ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి.

ఆయన మరణ వార్త చదువుతూ ఏడ్చేసిన యాంకర్..