చైనా లో మరో వైరస్, వణుకుతున్న ప్రజలు

ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఈ కరోనా తో జనాలు గడగడలాడుతుండగా చైనా లో మరో వైరస్ వెలుగు చూసినట్లు తెలుస్తుంది.

చైనా లో వెలుగుచూసిన కరోనా మహమ్మారి తో ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా మృతి చెందిన వారి సంఖ్య 15 వేలకు చేరుకోగా, లక్షల మంది ఆసుపత్రిలో ఈ వైరస్ తో పోరాడుతున్నారు.

ఈ వైరస్ కారణంగా కేవలం ఒక్క చైనాలో దాదాపు 3,300 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.

అయితే ఇప్పుడిప్పుడే ఆ వైరస్ నుంచి బయటపడుతున్న చైనా లో మరో కొత్త వైరస్ వెలుగుచూసింది.

చైనాలోని యునన్ ప్రావిన్సుల్లో ఓ వ్యక్తిలో హంటావైరస్ లక్షణాలతో సోమవారం మృతిచెందాడు.షాండాంగ్ ప్రావిన్సులకు వెళ్తున్న అతడు హంటావైరస్‌తో మృతిచెందినట్టు చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ వెల్లడించారు.

అతడు ప్రయాణించిన బస్సులోని మరో 32 మంది ప్రయాణికులకు కూడా పరీక్షలు నిర్వహించినట్టు తెలిపింది.

హంటావైరస్‌ను ఆండీస్ వైరస్ అని కూడా అంటారు.హంటావైరస్‌తో చైనా లో ఒకరు మృతిచెందిన విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

దీంతో ఇది మరో కరోనా వైరస్‌ మహమ్మారిగా విజృంభిస్తుందేమోనని ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

అయితే కరోనా వైరస్ మాదిరిగా హంటావైరస్ గాలిలో ఉండదట.సోకడానికి అసలు కారణం ఎలుకలేనట.

ఎలుకల లాలజలం, మూత్రం లేదా దాని వ్యర్థాలను తాకిన తర్వాత ఎవరైనా తమ కళ్లు, ముక్కు, నోటిని తాకితే అది సంక్రమిస్తుందని తెలిపింది.

చిలీ, అర్జెంటీనాలో అత్యంత అరుదైన కేసుల్లోనే ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించినట్టు తేలినట్లు తెలుస్తుంది.

దీనితో ఈ వైరస్ అనేది ఒకరి నుంచి మరొకరికి అంటుకోవడం చాలా అరుదు అని తెలుస్తుంది.

ఈ వైరస్ సోకినవారిలో హెచ్‌పీఎస్ రోగుల మాదిరిగానే జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, కడుపు నొప్పి, వికారం, వాంతులు, మైకం, విరేచనాలు, ఉదర సంబంధ లక్షణాలు ఉంటాయి.

అలాగే, వైరస్ తీవ్రత ఎక్కువయ్యే కొద్దీ ఊపిరితిత్తులు కఫంతో నిండిపోయి, శ్వాసతీసుకోవడానికి ఇబ్బందిగా మారుతుందట.

స్మశానం నుంచి ప్రపంచ కప్ వరకు..ఇతని కథ వింటే కన్నీళ్ళే !