16 ఏళ్ళ వయసుకే సొంత ఇల్లు కారు కొన్న టాలీవుడ్ హీరోయిన్.. ఎవరో తెలుసా?

తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ హన్సిక( Hansika Motwani ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన దేశముదురు( Desamuduru ) సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమా ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.

మొదటి సినిమాతోనే తన అందం అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది.అలాగే టాలీవుడ్ లో అల్లు అర్జున్, ఎన్టీఆర్, రవితేజ, నితిన్ లాంటి హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది హన్సిక.

ఈ ముద్దుగుమ్మకు ఏ రేంజ్ లో అభిమానులు ఉన్నారో మనందరికీ తెలిసిందే. """/" / మరి ముఖ్యంగా తమిళనాడు( Tamil Nadu )లో అయితే హన్సికకు అభిమానులు ఏకంగా గుడి కట్టేశారు అంటే ఏ రేంజ్ లో ఫాన్స్ ఫాలోయింగ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.

కాగా టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్( Puri Jagannadh ) దర్శకత్వం వహించిన దేశముదురు లో హన్సికని ఎంతో అందంగా చూపించారు.

ఇది ఇలా ఉంటే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న హన్సిక దేశముదురు సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.

ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో భాగంగా హన్సిక మాట్లాడుతూ.దేశముదురు సినిమా వల్లే నేను సొంత ఇల్లు, కారు కొనుక్కోగలిగాను.

"""/" / అలాగే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి ప్రధాన కారణం పూరి జగన్నాథ్ కాదు అంటూ షాక్ ఇచ్చింది హన్సిక.

తనని పూరి జగన్నాథ్ దృష్టిలో పడేలా చేసింది మాత్రం డైరెక్టర్ మెహర్ రమేష్ అని తెలిపింది.

చైల్డ్ ఆర్టిస్ట్ గా మెహర్ రమేష్ కి నా గురించి తెలుసు.దేశముదురు కోసం పూరి గారు కొత్త హీరోయిన్ కోసం వెతుకుతున్నప్పుడు మెహర్ రమేష్ ఆయనకి నా గురించి చెప్పారు.

చైల్డ్ ఆర్టిస్ట్ గా అద్భుతంగా నటించిందని చెప్పారట.దాంతో వెంటనే పూరి జగన్నాధ్ నన్ను దేశముదురు సినిమాలో ఎంపిక చేసుకున్నారు అని హన్సిక తెలిపింది.

తన గ్లామర్ తో మెస్మరైజ్ చేసిన హన్సిక వివాహ జీవితంలోకి అడుగుపెట్టింది.గత ఏడాది డిసెంబర్ 4న జైపూర్ లో హన్సిక, సోహైల్ వివాహబంధంతో ఒక్కటయ్యారు.

ప్రస్తుతం హన్సిక తన భర్తతో కలసి మ్యారేజ్ రొమాంటిక్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే.

హార్ట్ టచింగ్ వీడియో: భార్యను పర్ఫెక్ట్‌గా ఫొటో తీయడానికి నేలపై కూర్చున్న వృద్ధుడు!