ఆదిలోనే హంసపాదు.. ఎక్కగానే కుప్పకూలిన బ్రిడ్జి

ఎంతో చక్కగా కట్టిన కట్టడాలు వాటిని ప్రారంభించిన కాసేపటికే కుప్పకూలితే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఎప్పటివో ప్రాచీన కట్టడాలు, బ్రిడ్జిలు నేటికీ పదిలంగా ఉంటున్నాయి.అయితే కొత్తగా కట్టినవి కొంత కాలానికే శిథిలమవుతున్నాయి.

కాంట్రాక్టర్ల పుణ్యమా అని ఇలాంటి పరిస్థితి కనిపిస్తోంది.ఇదే కోవలో ఓ బ్రిడ్జిని అట్టహాసంగా ప్రారంభించడానికి ఏర్పాట్లు చేశారు.

అతిథులు, మీడియా ప్రతినిధులు, స్థానికులు రాగానే అది కూలిపోయింది.ఈ హఠాత్పరిణామంతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు.

దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. """/" / మెక్సికో నగరంలో ఇటీవల ప్రారంభోత్సవ వేడుకలోనే ఫుట్‌బ్రిడ్జ్ కూలిపోయింది.

ఈ సంఘటన తాజాగా జరిగింది.మెక్సికన్ నగరమైన క్యూర్నావాకా మేయర్ జోస్ లూయిస్ ఉరియోస్టెగుయ్ స్థానిక కాలువపై ప్రజలు రోడ్డు దాటేందుకు ఓ సుందరమైన ఫుట్ బ్రిడ్జిని ప్రారంభించడానికి ఏర్పాట్లు చేశారు.

చెక్క పలకలు, మెటల్ గొలుసులతో చేసిన వేలాడే వంతెన ఇటీవల పునర్నిర్మించబడింది.కార్పొరేషన్ సభ్యులతో సహా స్థానిక అధికారులు అక్కడికి వచ్చారు.

ప్రారంభిస్తున్న క్రమంలో సుమారు 10 అడుగుల ఎత్తులో ఉండే ఆ ఫుట్ బ్రిడ్జి ఒక్కసారిగా కుప్పకూలింది.

దీంతో వారంతా 3 మీటర్లు లోతు ఉన్న ప్రాంతంలో రాళ్లపై పడిపోయారు.ఈ సంఘటనపై మేయర్ జోస్ లూయిస్ స్పందించారు.

ప్రారంభోత్సవానికి ఒక్కసారిగా అందరూ వంతెనపైకి వచ్చేశారని, ఊగిసలాట జరగడంతో బ్రిడ్జి కూలిపోయిందని చెప్పారు.

ఇద్దరు అధికారులు, నలుగురు సిటీ కౌన్సిల్ సభ్యులు, ఒక స్థానిక రిపోర్టర్ గాయపడ్డారు.

గల్లీ నుండి స్ట్రెచర్లపై వెలికితీసి స్థానిక ఆసుపత్రులకు తరలించినట్లు అధికారులు తెలిపారు.ఇక మేయర్‌కు స్వల్ప గాయాలు కావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూలై 17, బుధవారం 2024