ఆ వ్యాధితో పోరాడి గెలిచిన హంసా నందిని ఇప్పుడెలా ఉందో మీరు చూశారా?
TeluguStop.com
తెలుగు సినీ ప్రేక్షకులకు హంసా నందిని గురించి ప్రత్యేకంగా గురించి అక్కర్లేదు.తెలుగులో పలు ఐటెం సాంగ్స్ లో చిందులు వేసి ఐటమ్ బ్యూటి గా కూడా పేరు తెచ్చుకుంది.
తెలుగులో హంసా నందిని మిర్చి, అత్తారింటికి దారేది, శౌర్యం లాంటి ఎన్నో సినిమాల్లో నటించి అందం అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది.
ఈమె చేసింది కొన్ని సినిమాలే అయినప్పటికీ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.అయితే ఐటమ్ సాంగ్స్ తో అదరగొట్టిన హంసా నందిని బ్రెస్ట్ కేన్సర్ బారిన పడిన విషయం మనందరికి తెలిసిందే.
ఇటీవల ఈమె క్యాన్సర్ బారిన పడినట్టు ఆమె వెల్లడించిన సంగతి తెలిసిందే. """/"/
2021 లో తన క్యాన్సర్స్ విషయాన్ని బయట పెట్టింది.
థర్డ్ స్టేజీలో ఉండగా ఆమె చికిత్స తీసుకోవటం మొదలుపెట్టారు.కొన్ని నెలల పాటు చికిత్స తీసుకుని ప్రాణాంతక వ్యాధినుంచి అదృష్టవశాత్తు బతికి బయటపడ్డారు.
చికిత్స సందర్భంగా ఆమె తనకు ఎంతగానో ఇష్టమైన కురులను తొలగించుకోవాల్సి వచ్చింది.కీమోథెరపీ చికిత్స చేయించుకుంటున్నంత కాలం గుండుతోనే ఉన్నారు.
చికిత్స అయిపోయి, ఆరోగ్యం కుదుటపడ్డ తర్వాతి నుంచి యధావిధిగా జుట్టు పెంచటం మొదలుపెట్టారు.
తాజాగా, ఆమె తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియోను షేర్ చేశారు. """/"/
ఆ వీడియోలో సంవత్సరం క్రితం తాను గుండుతో ఉన్న దృశ్యాలను, ఇప్పుడు జుట్టుతో ఉన్న దృశ్యాలను ఉంచారు.
అందుకు సంబంధించిన వీడియో ని షేర్ చేస్తూ ఈ విధంగా రాసుకొచ్చింది.ఓ సంవత్సరంలో చాలా జరిగాయి.
నేను ఆరోగ్యంగానే ఉన్నా అని రాసుకొచ్చారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.జుట్టు ఉన్నా జుట్టు లేకపోయినా.
యోధురాలివే.ఎల్లప్పుడూ రాణివే, మీరు ఆ వ్యాధినుంచి కోలుకుని ఆరోగ్యంగా ఉండటం చాలా సంతోషంగా ఉంది సంతోషంతో కామెంట్ చేయడంతో పాటు ఆమెకు ధైర్యాన్ని ఇస్తున్నారు.
బాలయ్య టాక్ షోకు పోటీగా రానా టాక్ షో.. ఆ ప్రముఖ షోకు హాజరయ్యే గెస్టులు వీళ్లే!