రేపటి నుండి ఒంటిపూట బడి

నల్లగొండ జిల్లా:రాష్ట్రంలో రేపటి నుంచి అన్ని పాఠశాలల్లో ఒంటిపూట తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది.

15 నుంచి ఏప్రిల్‌ 24 వరకు హాఫ్‌ డే తరగతులు కొనసాగుతాయని పేర్కొంది.

ఉదయం 8 నుంచి 12.30గంటల వరకు తరగతులు నిర్వహించాలని,ఆ తర్వాత విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలని విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

అయితే,వార్షిక పరీక్షల నేపథ్యంలో పదో విద్యార్థులకు ప్రత్యేక తరగతులు కొనసాగుతాయని, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వహించాలని చెప్పింది.

ఈ మేరకు ప్రాంతీయ విద్యాశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

తప్పనిసరిగా ఆదేశాలను అమలు చేయడంతో పాటు పర్యవేక్షించాలని ఆదేశించారు.

హార్వర్డ్ కుబేరుల వికృత చేష్టలు.. డబ్బును ఇలాగే తగలేస్తారా.. వీడియో లీక్!