ఈ అవిసె గింజల మాస్క్ తో హెయిర్ ఫాల్ బలాదూర్..!

హెయిర్ ఫాల్( Hair Fall ) అనేది ఆడ మగ అనే తేడా లేకుండా దాదాపు అందర్నీ వేధిస్తున్న కామన్ సమస్య.

అయితే అందరిలోనూ జుట్టు రాలడానికి ఒకే రకమైన కారణాలు ఉండవు.అధిక ఒత్తిడి, కాలుష్యం, పోషకాల కొరత పలు రకాల మందుల వాడకం తదితర అంశాలు జుట్టు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి.

ఏదేమైనా హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతున్న వారికి ఇప్పుడు చెప్పబోయే అవిసె గింజల మాస్క్( Flax Seed Mask ) చాలా ఉత్తమం గా సహాయపడుతుంది.

ఈ మాస్క్ వేసుకుంటే హెయిర్ ఫాల్ బలాదూర్ అవ్వడం ఖాయం. """/" / అందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు అవిసె గింజలు వేసుకోవాలి.

అలాగే అర కప్పు ఫ్రెష్ కొబ్బరి పాలు( Fresh Coconut Milk ) పోసి నాలుగు నుంచి ఐదు గంటల పాటు నానబెట్టుకోవాలి.

ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని నానబెట్టుకున్న అవిసె గింజలను పాలతో సహా వేసుకొని స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో ఒక ఎగ్ వైట్( Egg White ) మరియు వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ వేసుకొని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

"""/" / ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.

గంట అనంతరం తేలికపాటి షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒకసారి ఈ అవిసె గింజల మాస్క్ వేసుకుంటే జుట్టు మూలాల నుంచి బలోపేతం అవుతుంది.

జట్టు రాలడం క్రమంగా తగ్గుముఖం పడుతుంది.హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతుంది.

జుట్టు ఒత్తుగా మారుతుంది.అలాగే ఈ అవిసె గింజల మాస్క్ వేసుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యంగా త‌యార‌వుతుంది.

సిల్కీగా మెరుస్తుంది కాబట్టి హెయిర్ ఫాల్ కు దూరంగా ఉండాలి అని భావించేవారు తప్పకుండా ఇప్పుడు చెప్పుకున్న రెమెడీ ని ఫాలో అవ్వండి.

అధ్యక్షుడిగా ట్రంప్ .. భారతీయులపై పడగ విప్పుతోన్న జాతి వివక్ష