భారత సంతతి వ్యక్తికి జైలు శిక్ష..రీజన్ తెలిస్తే షాకే..

అమెరికాకి వెళ్ళిన ఎంతో మంది భారతీయులు ఎన్నో మంచి పనులు చేస్తూ భారత జాతి ఖ్యాతిని చాటి చెప్తుంటే కొంతమంది మాత్రం భారత దేశ పరువుని తీసేస్తున్నారు ఇప్పటికే అగ్రరాజ్యానికి భారతీయులు అంటే మింగుడుపడటం లేదు దాంతో వీసా లాంటి విషయాలపై ఆంక్షలు పెడుతూ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు.

అయితే తాజాగా జరిగిన సంఘటన భారతీయుల పరువు తీసిపడేసింది.వివరాలలోకి వెళ్తే.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ రమేశ్‌ వెంకట పోతూరు అనే 44ఏళ్ల వ్యక్తి భారత్‌కు చెందిన వారి నుంచి హెచ్‌1-బీ వీసా, గ్రీన్‌ కార్డుల దరఖాస్తుల కోసం అక్రమంగా 4,50,000 డాలర్లు సేకరించి మోసం చేశారు.

అయితే రమేశ్‌ వెంకట పోతూరు గతంలో విర్గో ఐఎన్‌సీ, ఐసీనెక్‌ సొల్యూషన్స్‌ కంపెనీల మాజీ యజమాని కూడా.

ఆయనకు ఏడాది ఒక రోజు జైలు శిక్ష విధించినట్లు అమెరికా ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు వెల్లడించారు.

!--nextpage అయితే రమేష్ 2010 నుంచి 2013 మధ్య కాలంలో దాదాపు వందకు పైగా వీసాలు, గ్రీన్‌ కార్డుల కోసం అక్రమంగా దాదాపు 4,50,000డాలర్లు సేకరించాడు.

అంతేకాదు హెచ్‌1-బీ వీసా, గ్రీన్‌ కార్డుల దరఖాస్తుల కోసం కస్టమర్ల నుంచి డబ్బును నేరుగా తన ఖాతాలోకి మళ్లించినట్లు అధికారులు విచారణ చేసి నేరాన్ని దృవీకరించారు.

త్రివిక్రమ్ పరిస్థితి ఇలా అయిపోయింది ఎంటి..మళ్ళీ ఆ మ్యాజిక్ చేస్తాడా ?