హెచ్ 1 బీ వీసా మోసం .. అమెరికాలో భారత సంతతి వ్యక్తికి జైలు శిక్ష, భారీ జరిమానా

అమెరికాలో హెచ్ 1 బీ వీసా మోసం( H-1B Visa Fraud ) పాల్పడినందుకు గాను భారత సంతతికి చెందిన వ్యక్తికి 14 నెలల జైలు శిక్ష విధించి కోర్ట్.

నానోసెమాంటిక్స్ అనే సంస్థకు సహ వ్యవస్ధాపకుడిగా వ్యవహరిస్తున్న కిషోర్ దత్తపురం( Kishore Dattapuram ) అనే వ్యక్తి బే ఏరియా టెక్ కంపెనీలకు నైపుణ్యం కలిగిన కార్మికులను అందించి భారీగా కమీషన్లు సంపాదించాడు.

ఈ నేరానికి గాను జైలు శిక్షతో పాటు మూడేళ్లు పర్యవేక్షణలో ఉండాల్సి ఉంటుంది.

ఉద్యోగాలు లేకుండా అభ్యర్ధులకు వీసాలు అందించాలన్నది ఈ పథకం లక్ష్యం.గతేడాది నవంబర్‌లో వీసా మోసం, కుట్ర అభియోగాలపై ఇద్దరు భారత సంతతి వ్యక్తులు నేరాన్ని అంగీకరించారు.

ఫిబ్రవరి 28, 2019న దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో కుమార్ అశ్వపతి , సంతోష్ గిరి సహా ముగ్గురిపై వీసా మోసానికి కుట్ర పన్నినందుకు ఒక అభియోగం, సబ్‌స్టాంటివ్ వీసా మోసానికి 10 అభియోగాలు నమోదు చేశారు.

జైలు శిక్షతో పాటు న్యాయమూర్తి డేవిలా.దత్తపురంకు మూడేళ్ల జైలు శిక్ష.

1,25,456.48 మిలియన్ల నగదు జప్తు.

7,500 డాలర్ల జరిమానా, 1,100 ప్రత్యేక అసెస్‌మెంట్ ఫీజు చెల్లించాలని ఆదేశించారని అమెరికా అటార్నీ కార్యాలయం ఏప్రిల్ 21న విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.

"""/" / దత్తపురం.శాన్‌ జోస్‌లో ఉన్న నానోసెమాంటిక్స్( Nanosemantics ) అనే కంపెనీకి సహ వ్యవస్ధాపకుడు.

ఇది బే ఏరియా టెక్ కంపెనీలకు నైపుణ్యం కలిగిన కార్మికులను అందిస్తుంది.నానోసెమాంటిక్స్ .

క్లయింట్ కంపెనీకి ఉంచిన ప్రతి కార్మికుడి నుంచి కమీషన్ అందుకున్నట్లు నివేదిక పేర్కొంది.

నానోసెమాంటిక్స్ క్రమం తప్పకుండా విదేశీ కార్మికుల నుంచి హెచ్‌ 1 బీ పిటిషన్లను సమర్పించేది.

హెచ్ 1 బీ వీసా పొందడానికి.అమెరికా పౌరసత్వ ఏజెన్సీకి ఆయా యజమానులు ఫారమ్ I-129 పిటిషన్‌ను సమర్పించాల్సి ఉంటుంది.

"""/" / ఈ పిటిషన్ , ఇతర డాక్యుమెంట్స్‌తో పాటు కార్మికుడికి ఉద్యోగం అందుబాటులో ఉండటంతో పాటు దాని కాల వ్యవధి, వేతనాలు వంటి వివరాలను పొందుపరచాలి.

నిందితుడు దత్తపురం.తోటి కేటుగాళ్లతో కలిసి మోసపూరితంగా హెచ్ 1 బీ దరఖాస్తులను సమర్పించాడు.

ఉద్యోగాలు అందుబాటులో లేకుండానే పత్రాలు సమర్పించినట్లు తేలింది.