హెచ్ 1 బీ వీసాలపై నిషేధం.. గందరగోళ పరిస్ధితులు: సిలికాన్ వ్యాలీ స్టార్టప్‌ల చూపు కెనడా వైపు

కరోనా వైరస్ కారణంగా అమెరికాలో నిరుద్యోగ సమస్యను అధిగమించేందుకు గాను ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలసలపై కఠిన ఆంక్షలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.

దీనిలో భాగంగా డిసెంబర్ 31 వరకు హెచ్ 1 బీ వీసాల జారీపై నిషేధం విధించారు.

దీని కారణంగా అక్కడి కంపెనీలు నిపుణుల కొరతను ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.దీంతో అనేక సంస్థలు తమ కార్యక్షేత్రాన్ని పక్కనే వున్న కెనడాకు మార్చుకునే ఆలోచనలో ఉన్నాయి.

ప్రధానంగా సిలికాన్ వ్యాలీలోని కొన్ని స్టార్టప్‌లు తమ ఇంజనీరింగ్ బృందాలను కెనడాకు తరలించాలని భావిస్తున్నాయి.

వీసా సస్పెన్షన్ కారణంగా గత కొన్నేళ్లుగా జరుగుతూ వస్తున్న ఈ షిఫ్టింగ్.ఇప్పుడు మరింత వేగవంతం అయ్యే అవకాశాలున్నాయని ఇన్నోవేషన్ ఎండేవర్స్ ప్రిన్సిపాల్ భరద్వాజ్ అభిప్రాయపడ్డారు.

దీనికి గతిక్ సంస్థ మంచి ఉదాహరణగా చెప్పారు.ఈ సంస్థ గతేడాది కెనడాలో ఓ కార్యాలయాన్ని ప్రారంభించింది.

ప్రస్తుతం అమెరికాలో వీసా సమస్యల కారణంగా అక్కడ తన బృందాన్ని మరింత విస్తరించే దిశగా అడుగులు వేస్తోంది.

మొబ్‌స్క్వాడ్ వంటి కెనడియన్ సిబ్బంది సంస్థలు అమెరికాలో ఉన్న భారతీయ ఇంజనీర్లతో పాటు ప్రజలను తరలించాలనుకునే సంస్థల నుంచి తమకు గతకొంతకాలంగా విజ్ఞప్తులు వస్తున్నట్లు తెలిపింది.

"""/"/ చెల్లుబాటయ్యే వర్క్ పర్మిట్ ఉన్నప్పటికీ, హెచ్ 1 బీ వీసాల భవిష్యత్తు గురించి కొనసాగుతున్న అనిశ్చితి, శాశ్వత నివాసానికి సుదీర్ఘ సమయం కారణంగా టెక్ నిపుణులను ప్రత్యామ్నాయ మార్గాలవైపు ప్రేరేపిస్తున్నాయి.

కాగా చిన్న వ్యాపారాలపై దృష్టిపెట్టిన అమెరికాకు చెందిన నార్త్ వన్ బ్యాంక్ సీఈవో మాట్లాడుతూ.

కెనడాలోని టొరంటో కార్యాలయంలో పనిచేయడానికి కంపెనీ అమెరికాలోని వలసదారుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోందని చెప్పారు.

కెనడియన్ సహ వ్యవస్థాపకులను కలిగివున్న అనేక సిలికాన్ వ్యాలీ స్టార్టప్‌లు కెనడాలో గత రెండేళ్లుగా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాయి.

స్థానికంగా అధిక నైపుణ్యం కలిగిన ప్రతిభావంతుల లభ్యతతో పాటు, అమెరికాలో వీసా సవాళ్ల కారణంగా కెనడావైపు అనేక కంపెనీలు చూస్తున్నాయి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్22, ఆదివారం 2024