ఇలాంటి మగవారికి ఆడవాళ్ళంటే భయం

ఇలాంటి మగవారికి ఆడవాళ్ళంటే భయం

మనలో దాదాపుగా అందరు నాగార్జున నటించిన మన్మథుడు సినిమా చూసే ఉంటారు.అందులో నాగార్జునకి అమ్మాయిలంటే అస్సలు పడదు.

ఇలాంటి మగవారికి ఆడవాళ్ళంటే భయం

పచ్చిగా చెప్పాలంటే, ఆడవాళ్ళని అసహ్యించుకుంటాడు.ఇలాంటి వాళ్ళు నిజంగా మీకెప్పుడైనా కనబడ్డారా? సినిమాల్లో ఉన్నట్లు బయట ఎందుకు ఉంటారు అని అనుకోకండి.

ఇలాంటి మగవారికి ఆడవాళ్ళంటే భయం

నిజజీవితంలో కూడా అమ్మాయిలని అసహ్యించుకునే మగవారు ఉంటారు.దీన్ని గైనోఫోబియా లేదా ఫెమినోఫొబియా అని అంటారు.

అయితే మన్మథుడులో హీరోకి గైనోఫోబియా లేదు.ఒక అమ్మాయి మోసం చేసిందని పొరబడి స్త్రీ జాతి మీద ద్వేషం పెంచుకుంటాడు అంతే.

గైనోఫోబియా ఉన్న మగవారు ఆడవారిని ద్వేషించడమే కాదు భయపడతారు కూడా.అవును, ఇలాంటి మగవారికి ఆడవారంటే అంటరానివారితో సమానం.

అలాగే వారి కంటికి ఏదో దెయ్యం లాగా కనిపిస్తారు.వీరికి ఆడవారితో మాట్లాడాలన్నా, కలిసి ఉండాలన్నా భయమే.

విచిత్రమైన విషయం ఏమిటంటే, మామూలు మగవారి లాగా వీరు అమ్మాయిల పట్ల ఆకర్షితులు కానే కారు.

కళ్ళు పైకి ఎత్తి చూడాలన్నా భయమే, పక్కన నిలబడాలన్నా భయమే.ఇక శృంగారం అనేది చాలా దూరమైన విషయం.

చాలామంది మగవారు స్వలింగ సంపర్కంలో మక్కువ చూపించడానికి ఈ గైనోఫొబియా కూడా కారణం.

మరి ఈ ఫెమినోఫోబియాకి కారణాలు ఎంటి అనేది సరిగ్గా చెప్పడం కష్టమే.చిన్ననాటి నుండి ఆడవారితో సత్సంబంధాలు లేకపోవడం, ఆడవారి వలన శారీరకంగా, మానసికంగా బాధపడటం ఈ అబ్నార్మల్ బిహేవియర్ కి కారణం కావచ్చు.

దుబాయ్‌లో దారుణం .. ఇద్దరు తెలుగువారిని నరికి చంపిన పాకిస్తానీ

దుబాయ్‌లో దారుణం .. ఇద్దరు తెలుగువారిని నరికి చంపిన పాకిస్తానీ