వైరల్ వీడియో: నాకు ఈ గతి పడుతుందని అనుకోలేదు.. లేడీ డాక్టర్ ఆత్మహత్యయత్నం

హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో( Saroor Nagar ) అత్తమామల వేధింపులు భరించలేక ఓ గైనకాలజీ డాక్టర్( Gynecologist ) సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్యాయత్నం చేసిన విషాదకర ఘటన చర్చనీయాంశంగా మారింది.

ఫెర్నాండెజ్ ఆసుపత్రిలో( Fernandez Hospital ) గైనకాలజీ డాక్టర్‌గా పని చేస్తున్న ప్రణీతకు,( Praneetha ) సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న సికిందర్‌తో( Sikander ) 2018లో వివాహమైంది.

వీరికి ముగ్గురేళ్ల పాప కూడా ఉంది.మొదట అమెరికాలో స్థిరపడిన వీరు 2021లో తిరిగి హైదరాబాద్‌కు వచ్చారు.

ప్రస్తుతం చంపాపేట్ ప్రెస్ కాలనీలో అత్తమామలతో కలిసి నివసిస్తున్నారు.అయితే గత కొంత కాలంగా భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తడంతో ఇద్దరూ విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు.

ఈ నేపథ్యంలో భర్త సికిందర్ ఎక్కడికో వెళ్లిపోయాడు.ప్రణీత తన కూతురు, తల్లి రూపతో కింద పోర్షన్‌లో ఉంటుండగా, అత్తమామలు పై పోర్షన్‌లో ఉంటున్నారు.

ఇటీవల ప్రణీత, అత్తమామల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి.అత్తమామల వేధింపులపై ప్రణీత పలుమార్లు సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ, పోలీసులు సరిగ్గా స్పందించలేదని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

"""/" / సోమవారం రాత్రి మరోసారి గొడవ జరగడంతో ప్రణీత పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది.

అయితే, కేసును పట్టించుకోవాల్సిన పోలీసులు ఆమె సమస్యను నిర్లక్ష్యంగా తీసుకుని "వేరుగా ఎందుకు ఉండలేరు?" అంటూ సలహా ఇచ్చారని కుటుంబ సభ్యులు తెలిపారు.

ఈ పరిస్థితుల్లో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన ప్రణీత, సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్యాయత్నం చేసింది.

ఈ విషయాన్ని గమనించిన ఆమె తల్లి రూప, ప్రణీతను వెంటనే ఆసుపత్రికి తరలించారు.

ప్రస్తుతం వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. """/" / ప్రణీత కుటుంబ సభ్యులు ఆరోపణ మేరకు.

సీఎం సెక్యూరిటీ ఆఫీసులో ఉన్న ఓ అధికారి తరచూ పోలీసులకు ఫోన్ చేసి అత్తమామలకు మద్దతు ఇస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

తమ కుమార్తె పుట్టిన రోజునే ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడిందని, పోలీసుల నిర్లక్ష్యమే దీనికి కారణమని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ఘటనకు నిరసనగా ప్రణీత కుటుంబ సభ్యులు, బంధువులు వారి ఇంటి ముందు, అలాగే సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు.

పోలీసులు తమ బాధను పట్టించుకోకపోవడంతోనే ఈ దుస్థితి ఎదుర్కొవాల్సి వచ్చిందని వారు ఆరోపించారు.

ఈ ఘటనపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనే దానిపై అందరి దృష్టి నెలకొంది.

మహిళల రక్షణపై అధికారుల బాధ్యతా రహిత వైఖరి మరోసారి ప్రశ్నార్థకంగా మారింది.

హీరో ప్రభాస్ కు ఆ విషయం తెలీదు…. ఆయన ఒక ప్రైవేట్ పర్సన్: పృథ్వీ రాజ్ సుకుమారన్