ఒకవైపు రక్తం కారుతున్నా బ్యాండేజ్ వేసుకుని నటించాను.. జీవీ ప్రకాశ్ కామెంట్లు వైరల్!

తెలుగు ప్రేక్షకులకు సంగీత దర్శకుడు నటుడు హీరో జీవి ప్రకాష్ కుమార్( Prakash Kumar ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

ఇటీవల కాలంలో సినిమాల విషయంలో ఫుల్ జోష్ గా ఉన్నారు జీవి ప్రకాష్ కుమార్.

ఒకవైపు హీరోగా నటిస్తూనే మరొకవైపు సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తూ వరుస సినిమాలతో మంచి జోష్ లో ఉన్నారు.

ఇప్పటికీ మ్యూజిక్ డైరెక్టర్గా 100 చిత్రాల మైలు రాయిను కూడా దాటేసిన విషయం తెలిసిందే.

అదేవిధంగా కింగ్ స్టన్ అనే సినిమాతో నటుడుగా కూడా 25 సినిమాల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు జీవి ప్రకాష్.

కమల్‌ ప్రకాశ్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ ఫాంటసీ హారర్‌ థ్రిల్లర్‌ ను జీవీ ప్రకాశ్‌ స్వయంగా నిర్మించడం మరో విశేషం.

"""/" / ఈ సినిమా ఈనెల 7న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.

ఈ నేపథ్యంలోనే సోమవారం హైదరాబాద్‌ లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకున్నారు జీవీ ప్రకాశ్‌ కుమార్‌.

కింగ్‌స్టన్‌ సినీ ప్రేక్షకులను ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుందని బలంగా నమ్ముతున్నాము.మేము ఈ చిత్రం ద్వారా మన అమ్మమ్మలు, బామ్మలు చెప్పిన కథల్ని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాము.

భారతీయ తెరలపై ఇప్పటి వరకు ఇలాంటి సినిమా రాలేదు.ప్రేక్షకులకు ఇది తప్పకుండా ఒక సరికొత్త అనుభూతిని అందిస్తుంది అని తెలిపారు.

అనంతరం జీవి ప్రకాష్ మాట్లాడుతూ.ఈ సినిమాలో చాలా బలమైన కథ ఉంది.

"""/" / సముద్ర తీరం దగ్గరున్న ఒక ఊరి కథ ఇది.మాములుగా ఇలాంటి ఊర్లలో జాలర్లందరూ చేపల వేటకు సముద్రంలోకి వెళ్తుంటారు.

కానీ, ఆ ఊరిలో ఎవరూ సముద్రంలోకి వెళ్లరు.దానికి కారణం ఒక శాపం.

మరి శాపం ఏంటి? దాన్ని ఎదిరించి సముద్రంలోకి వెళ్లినప్పుడు హీరోకి ఎదురైన అనుభవాలేంటి? అన్నది ఆసక్తికరం.

ఈ చిత్రంలో జాంబీలు ఆత్మలు నిధులు ఇలా ఆకర్షించే అంశాలు బోలెడన్ని ఉన్నాయి.

శారీరకంగా మానసికంగా నన్నెంతో కష్టపెట్టిన చిత్రమిది.దీంట్లో అండర్‌ వాటర్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌( Underwater Action Sequence ) లు ఉన్నాయి.

బోట్‌ పై యాక్షన్‌ సీక్వెన్స్‌ లు చేస్తున్నప్పుడు నేల తడిగా ఉండటం వల్ల జారిపడి కాళ్లకు, వేళ్లకు గాయాలయ్యేవి.

ఒక వైపు రక్తం కారుతున్నా సరే బ్యాండేజ్‌ వేసుకుని మళ్లీ చిత్రీకరణ కొనసాగించే వాడిని అని చెప్పుకొచ్చారు జీవి ప్రకాష్.