క్రికెట్ స్టేడియంలో గుట్కా నములుతూ అడ్డంగా బుక్కయిన ప్రేక్షకుడు.. ఆడేసుకుంటున్న నెటిజన్లు!

కాన్పూర్ వేదికగా టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య గురువారం రోజు తొలి టెస్ట్ మ్యాచ్ ఆరంభమైంది.

కరోనా వ్యాప్తి తీవ్రత దాదాపు పూర్తిగా తగ్గిపోవడంతో క్రికెట్ ప్రియులను స్టేడియంలోకి అనుమతించారు అధికారులు.

దాంతో వేలాదిమంది ఫ్యాన్స్ ఎంతో ఉత్సాహంతో లైవ్ మ్యాచ్ ను నేరుగా వీక్షించేందుకు గ్రీన్ పార్క్ స్టేడియానికి వచ్చారు.

మ్యాచ్ జరుగుతున్న సమయంలో టీమిండియా ఫ్యాన్స్ పెద్ద ఎత్తున సందడి చేస్తూ స్టేడియం హోరెత్తించారు.

అయితే ఈ నేపథ్యంలోనే ఒక ప్రేక్షకుడు గుట్కా నములుతూ కెమెరా కంటికి చిక్కాడు.

కుర్చీలో కులాసాగా కూర్చుని.గుట్కా నములుతూ.

ఫోన్ మాట్లాడుతూ అతడు చాలా స్టైల్ గా కనిపించాడు.తన పక్కనే ఉన్న యువతిపై చేయి వేసి అతడు మాట్లాడుతున్న తీరు నవ్వు తెప్పించింది.

బహుశా అందుకేనేమో దాదాపు పది సెకన్ల పాటు కెమెరామెన్ అతడిపైనే ఫోకస్ చేసేసాడు.

ఈ పది సెకన్ల వీడియో క్లిప్ లో ఈ ప్రేక్షకుడు గుట్కా నములుతున్నపుడు కెమెరామెన్ ఫోకస్ చేసినట్లు కనిపించింది.

స్టేడియంలోని బిగ్ స్క్రీన్ లో ఈ దృశ్యాలు కనిపించడంతో అతని పక్కనే ఉన్న యువతి ఆశ్చర్యపోయింది.

వెంటనే కెమెరా కి హాయ్ చెప్తూ ఎంజాయ్ చేసింది.ఇంతలో అతను కూడా గుట్కా నములుతూనే హాయ్ చెప్పాడు.

"""/"/ ఈ వీడియోని వసీం జాఫర్ అనే మాజీ టెస్ట్ క్రికెటర్ ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు.

దాంతో నెటిజన్లు గుట్కా నములుతున్న ఈ ప్రేక్షకుడిని ఒక ఆట ఆడేసుకుంటున్నారు.మీమ్స్, జోక్స్ లతో అతడిని బాగా ట్రోల్ చేస్తున్నారు.

వెల్కమ్ టు ఉత్తర ప్రదేశ్ అని నెటిజన్లు ఫన్నీ మీమ్స్ క్రియేట్ చేసి నెట్టింట వదులుతున్నారు.

ఆ స్టేడియమంతటా పాన్ బహార్ హోల్డింగ్ లు, ప్రకటనలే దర్శనమిస్తున్నాయట.వీటిని వదిలేసి ఒక్కడినే నిందించడంలో ఏం ప్రయోజనం ఉందంటూ మరి కొందరు ఉత్తర ప్రదేశ్ పై అహం వ్యక్తం చేస్తున్నారు.

ఉత్తరప్రదేశ్ లో పాన్ చాలా చౌక అని.కావాలంటే మేం మీకు తీసుకువస్తాం అంటూ ఇంకొందరు నెటిజన్లు సెటైర్లు పేల్చుతున్నారు.

గుజరాత్ మీద ఢిల్లీ క్యాపిటల్స్ విజయానికి కారణం ఇదే…