సూర్యాపేటలో ఈదురు గాలులతో కూడిన వర్షం

సూర్యాపేటలో ఈదురు గాలులతో కూడిన వర్షం

సూర్యాపేట జిల్లా: జిల్లా కేంద్రంలో ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది.కొద్దిసేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం రావడంతో పట్టణ ప్రజలు ఎండ తీవ్రత నుండి కొద్దిగా ఉపశమనం పొందారు.

సూర్యాపేటలో ఈదురు గాలులతో కూడిన వర్షం

ఈ అకాల వర్షం కారణంగా జిల్లా కేంద్రంలోని ఖమ్మం రోడ్లో బీబీగూడెం మధుర వైన్స్ వద్ద విద్యుత్ స్తంభం కూలిపోయి ట్రాఫిక్, విద్యుత్ సమస్య తలెత్తగా,కుడకుడలో ప్రభుత్వ హైస్కూల్ లో చెట్టు విరిగి పదవ తరగతి గదిపై పడింది.

సూర్యాపేటలో ఈదురు గాలులతో కూడిన వర్షం

ఖమ్మం రోడ్,అంజనపురి కాలనీలో జనగాం వెళ్ళే రోడ్డులో, చెట్లు నేలకొరిగి రోడ్డుకు అడ్డంగా పడ్డాయి.

దీనితో వాహనదారులు,ప్రజలు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొన్నారు.ట్రాఫిక్ పోలీసులు,విద్యుత్ అధికారులు ఘటనా స్థలాలకు చేరుకొని విరిగిన చెట్లను తొలగించి,ట్రాఫిక్, విద్యుత్ పునరుద్ధరించే పనిలో నిమగ్నమయ్యారు.

యూఏఈలోని ఎన్ఆర్ఐలకు అలర్ట్ .. పాస్‌పోర్ట్ రెన్యూవల్ గైడ్‌లైన్స్ చూశారా?

యూఏఈలోని ఎన్ఆర్ఐలకు అలర్ట్ .. పాస్‌పోర్ట్ రెన్యూవల్ గైడ్‌లైన్స్ చూశారా?