గుంటూరు కారం సినిమా మీద హైప్ పెంచుతున్న గురూజీ…
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా మహేష్ బాబు( Mahesh Babu ) తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్నాడు.
ఇక ఇలాంటి క్రమంలోనే తెలుగులో మంచి డైరెక్టర్ గా గుర్తింపు పొందిన త్రివిక్రమ్ శ్రీనివాస్( Trivikram Srinivas ) డైరెక్షన్ లో గుంటూరు కారం అనే సినిమా చేస్తున్నాడు.
ఇక ఈ సినిమా పట్ల ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి.అయితే ఈ సినిమా 2024 సంక్రాంతి కనుక గా ప్రేక్షకులు ముందుకు రానుంది ఓకే సినిమా మీద రోజు రోజుకి అంచనాలు విపరీతంగా పెరుగుతున్నాయి.
"""/" / ఇక రీసెంట్ గా ప్రొడ్యూసర్ అయిన నాగ వంశీ ( Naga Vamsi )మీడియా తో మాట్లాడుతూ గుంటూరు కారం సినిమా( Guntur Kaaram )కు ఎవరు హైప్ తీసుకురావాల్సిన పనిలేదు ఆ స్టోరీ నే దానికి బలం, ఇండస్ట్రీ హిట్టు కొట్టడం పక్క అంటూ పలు రకాల కామెంట్లు చేశాడు.
ఇక ఇంతకుముందు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఆ కథ లో దమ్ముంది అంటూ చాలా సార్లు చెప్పడం జరిగింది మాటలు చూస్తుంటే గుంటూరు కారం సినిమా మీద ఆల్రెడీ జనాల్లో అంచనాలు ఇప్పటికే తారాస్థాయిలో ఉన్నాయి.
ఇక ఈ సినిమా అభిమానుల అంచనాలను అందుకోవాలి అంటే మాత్రం చాలా అద్భుతంగా సినిమా ఉండాలి.
లేకపోతే మాత్రం ఈ సినిమా కూడా ప్లాప్ అవుతుంది. """/" / ఇక ఇలాంటి క్రమంలో వీళ్లు ఎందుకు ఈ సినిమా పైన ఇంత అంచనాలను పెంచుతున్నారా అనేది కూడా తెలియాల్సి ఉంది.
అయితే ఈ సినిమాలో గురూజీ సరికొత్త స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ని గాని వాడినట్టుగా తెలుస్తుంది.
ఇది త్రివిక్రమ్ సినిమా అనే చెప్పాలి.అంటూ ఇప్పటికే చిత్ర యూనిట్ నుంచి చాలా రకాల క్లూ లు కూడా ఇస్తున్నారు.
డైరెక్టర్ త్రివిక్రమ్, ప్రొడ్యూసర్ నాగ వంశీ లాంటివారు ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు అంటే ఈ సినిమాలో ఏదో విషయం ఉందని కూడా భావిస్తున్నారు.
ప్రభాస్ పెళ్లిపై గుడ్ న్యూస్ చెప్పిన చరణ్…. అమ్మాయి వివరాలు లీక్!