సమస్యలకు నిలయంగా గుర్రాలదండి పంచాయతీ
TeluguStop.com
యాదాద్రి భువనగిరి జిల్లా: జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న బీబీనగర్ మండలం గుర్రాలదండి గ్రామం అభివృద్ధిలో ఆమడదూరం ఉంటూ సమస్యలతో సహవాసం చేస్తుంది.
గ్రామంలో ఎక్కడ చూసినా పారిశుద్ధ్యం పడేకేసి,మురికి కాలువలు కంపు కొడుతున్నాయి.వెలుగులు పంచని వీధి దీపాలు,విద్యుత్ స్తంభంపై కోతి చనిపోయి దుర్వాసన వస్తున్నా పట్టించుకునే నాధుడే కరువయ్యాడు.
ఓపెన్ జిమ్ పరికరాలు పచ్చగడ్డి, పిచ్చి చెట్లతో నిండిపోయి, పాములు,తేళ్లు,విషపు పురుగులు సంచరిస్తున్నాయి.
ఇక ప్రాథమిక పాఠశాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.పరిసరాలతో పాటు బాత్రూంల వద్ద పిచ్చి మొక్కలు పెరిగి చెత్తాచెదారంతో నిండిపోయింది.
తూతూ మంత్రంగా రెండు ఏళ్ల క్రితం పాఠశాలకు రిపేర్ చేయించారు తప్ప,ఇంత వరకు పెయింటింగ్ వేయలేదు.
కనీసం సున్నం కూడా వేయలేని స్థితి.చేసిన పనులకే బిల్లులు రాని పరిస్థితి ఉందని అంటున్నారు.
కేవలం 9 మందితో పాఠశాల నడిపిస్తున్నారు.వారికి వంట చేయడానికి సామాగ్రి,వసతి లేక వంట చేసే వారి ఇంట్లో వంట చేసుకుని స్కూల్లో వడ్డిస్తున్నారు.
పిల్లలకు ఫుడ్ ఫాయిజన్ అయితే ఎవరు భాద్యత వహిస్తారో పాలకులకే తెలియాలి.స్కూల్లో చదువుకోవాలనే పాజిటివ్ థాట్స్ వచ్చేలా చిత్రాలు,పెయింటింగ్ లేకపోవడంతో బూతు బంగ్లాను తలపిస్తుంది.
పిల్లలు ప్రభుత్వ పాఠశాల వదిలి ప్రైవేట్ పాఠశాల వెళుతున్న దుస్థితి నెలకొంది.నిధులు లేవని ప్రజాప్రతినిధులు, అధికారులు గ్రామాభివృద్ధిని పట్టించుకోకుండా గాలికి వదిలేశారు.
దీనితో రోడ్లు, డ్రైనేజీ,వాటర్ ఫిల్టర్, విద్యుత్,పాఠశాల,ఓపెన్ జిమ్ పరిసరాల్లో ఎక్కడ చూసినా కనిపించని శుభ్రత.
గత సంవత్సర కాలంగా ప్రత్యేక అధికారుల పాలనలో గ్రామం మొత్తం అస్తవ్యస్తంగా తయారైందని,కాంగ్రెస్ ఏడాది పాలనకు ఈ గ్రామం నిదర్శనంగా నిలుస్తుందని గ్రామస్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం స్పందించి గ్రామంలో పేరుకుపోయిన సమస్యలను తక్షణమే పరిష్కరించేలా ప్రత్యేక బడ్జెట్ విడుదల చేసి ప్రజలకు కావలసిన కనీస సౌకర్యాలు,పాఠశాల పిల్లలకు కనీస వసతులు అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
బన్నీకి లక్ కలిసొచ్చి పుష్ప2 హిట్టైందా.. తర్వాత సినిమాలకు ఈ స్థాయి కలెక్షన్లు కష్టమేనా?