వైసీపీ గూటికి చేరిన గుర్నాథరెడ్డి !
TeluguStop.com
వైసీపీ నుంచి టీడీపీ గూటికి చేరి.మళ్ళీ ఇప్పుడు టీడీపీ నుంచి వైసిపీలో చేరిపోయారు అనంతపురం మాజీ ఎమ్యెల్యే గుర్నాథరెడ్డి.
ఈయన గత కొంతకాలంగా టీడీపీ లో ఇమడలేకపోతున్నాను అంటూ.సంకేతాలు పంపుతున్నారు.
ఈ మేరకు శ్రీకాకుళం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి.
ఆయన సమక్షంలో గురునాథ్‌రెడ్డి వైసీపీ గూటికి చేరిపోయారు. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
.
ఈ సందర్భంగా గురునాథ్‌రెడ్డికి జగన్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా గురునాథ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.
చంద్రబాబు పాలనలో ఆయన కుటుంబసభ్యులు, టీడీపీ నేతలే తప్ప ప్రజలెవరూ సంతోషంగా లేరని అన్నారు.
ప్రత్యేక హోదా కోసం మొదటనుంచీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంటే.చంద్రబాబు మాత్రం పూటకో మాట మార్చారని, నాలుగున్నరేళ్లుగా దోచుకోవడం తప్ప రాష్ట్రాభివృద్ధికి ఆయన చేసిందేమీ లేదని విమర్శించారు.
రేవంత్ రెడ్డి పై ఫైర్ అయిన యాంకర్ శ్యామల … తెలంగాణలో చాలా సమస్యలు ఉన్నాయంటూ?