ఆస్ట్రియా పార్లమెంట్ ఎన్నికల బరిలో భారత సంతతి నేత.. గెలిస్తే చరిత్రే!!
TeluguStop.com
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం విదేశాలకు వెళ్లి అక్కడే స్థిరపడిన భారతీయులు కీలక స్థానాలకు చేరుకుంటున్న సంగతి తెలిసిందే.
తాజాగా ఆస్ట్రియాలో( Austria ) భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచారు.
51 ఏళ్ల గుర్దియల్ సింగ్ బజ్వా.( Gurdial Singh Bajwa ) ఆస్ట్రియన్ నేషనల్ కౌన్సిల్ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.
సోషల్ డెమొక్రాటిక్ పార్టీ ఆఫ్ ఆస్ట్రియా (ఎస్‌పీవో)కి( Social Democratic Party Of Austria ) ప్రాతినిథ్యం వహిస్తున్న బజ్వా సెప్టెంబర్ 29న జరగనున్న ఎన్నికల్లో గెన్సెర్‌డార్ఫ్, బ్రూక్ యాన్ డెర్ లీతా నియోజకవర్గాల నుంచి పోటీ చేయనున్నారు.
బజ్వా అభ్యర్ధిత్వం ఆస్ట్రియాలోని భారతీయ , సిక్కు కమ్యూనిటీలకు గర్వ కారణమని స్థానికులు అంటున్నారు.
ఇది దేశ రాజకీయ దృశ్యంలో పెరుగుతున్న వైవిధ్యాన్ని హైలైట్ చేస్తుందన్నారు.వాస్తవానికి పంజాబ్‌లోని భోలాత్‌లో ముడోవల్ గ్రామానికి చెందిన బజ్వా తన ఏడేళ్ల వయసులో కుటుంబంతో కలిసి ఆస్ట్రియాకు వలస వెళ్లాడు.
2020 నుంచి డ్యూచ్ వాగ్రామ్ సిటీ కౌన్సిలర్‌గా సేవలందించిన బజ్వా.వియన్నా ఛాంబర్ ఆఫ్ కామర్స్‌లో రవాణా, ట్రాఫిక్ విభాగాలకు డిప్యూటీ ఛైర్మన్‌గానూ వ్యవహరించారు.
"""/" /
ఆర్ధిక వృద్ధి, సమానత్వం, ఆస్ట్రియన్లందరికీ ఉజ్వల భవిష్యత్తును పెంపొందించడం, ఇండియన్ డయాస్పోరా( Indian Diaspora ) కోసం పాటుపడతానని బజ్వా తన ఎన్నికల ప్రచారంలో పేర్కొన్నారు.
సిక్కు కమ్యూనిటీకి( Sikh Community ) చెందిన వ్యక్తి కావడంతో బజ్వాపై జాత్యహంకార దాడులు సహా పలు సవాళ్లను ఎదుర్కొంటున్నారు.
అయినప్పటికీ ఆయన తన మిషన్‌కు కట్టుబడి ఉన్నారు.గుర్దియాల్ కనుక ఎన్నికల్లో గెలిస్తే.
ఆస్ట్రియా పార్లమెంట్‌లో( Austria Parliament ) అడుగుపెట్టిన తొలి సిక్కు సంతతి వ్యక్తిగా చరిత్ర సృష్టిస్తారు.
"""/" /
ఇదిలాఉండగా.యూరోపియన్ దేశమైన ఆస్ట్రియాతో గతేడాది భారత్ కీలక మొబిలిటీ ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ మేరకు గతేడాది జనవరిలో ఆ దేశ రాజధాని వియన్నాలో జరిగిన కార్యక్రమంలో భారత్, ఆస్ట్రియా దేశాల విదేశాంగ మంత్రులు ఒప్పందంపై సంతకాలు చేశారు.
ఈ సందర్భంగా కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ మాట్లాడుతూ.ఆస్ట్రియాలో నిపుణులుగా పనిచేయాలనుకునే భారతీయులకు వాటిని మరింత సులభతరం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.
గతంలో దీనికి సవాలక్ష నిబంధనలు వుండేవని జైశంకర్ అన్నారు.The Comprehensive Migration And Mobility Partnership Agreement ద్వారా భారతీయులు తమ ప్రతిభను, నైపుణ్యాలను ప్రదర్శించేందుకు అవకాశం కల్పిస్తుందని జైశంకర్ పేర్కొన్నారు.
తాజాగా ఆస్ట్రియాతో కుదుర్చుకున్న ‘‘రెడ్ వైట్ రెడ్ కార్డ్’’ , వర్కింగ్ హాలిడే ప్రోగ్రాం ఒప్పందాన్ని కూడా మంత్రి ప్రస్తావించారు.
దీని కింద విద్యార్ధులు ఆరు నెలల పాటు ఆస్ట్రియాలో పనిచేయొచ్చని జైశంకర్ పేర్కొన్నారు.
ఏందిది.. లగ్జరీ బ్యాగులు పక్కన పెట్టేసి.. బాస్మతి బియ్యం సంచులను వాడుతున్న అమెరికన్లు..